ఆరోగ్య భీమా తీసుకునే ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి

భీమా అనేది ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ అవసరమే. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వ్యాధులు, రోగాలు పుట్టుకొస్తున్నాయి. అలాగే జనాలు తరుచుగా అనారోగ్యనికి గురిఅవుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు జీవిత భీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో హెల్త్ పాలసీ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అయిపోయింది. ఎందుకంటే వైద్య ఖర్చులు రోజురోజుకీ సామాన్యుడు మోయలేని భారంగా మారుతున్నాయి.

ఆరోగ్య భీమా తీసుకునే ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి

ఏదైనా తీవ్ర అనారోగ్యం బారినపడ్డా, ప్రమాదానికి గురైనా అటువంటి పరిస్థితులలో ఆదుకునేది హెల్త్ పాలసీ మాత్రమే. అయితే చాలామంది తెలియకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేడప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేమి అంత పెద్ద తప్పులు కావని మొదట్లో అనిపించినా తరువాత చివరకు క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకే హెల్త్ పాలసీ తీసుకునే ముందు ఏఏ అంశాలను పరిశీలించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

  • మీకు ఈ ఇన్సురన్సులో ఎంత కవరేజీ అవసరం అన్నదానిపై అవగాహన ఉండాలి.
  • ప్రీమియం తగ్గుతోంది కదా అని తొందరపడి కవరేజీ తక్కువగా ఎంచుకోవద్దు.
  • ముందుగా మీరు తీసుకుంటున్న కవరేజీ మీ వైద్య ఖర్చులకు సరిపోతాయో లేదో లెక్క వేసుకోవాలి.
  • పాలసీ తీసుకునే  ముందు కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య మరియు వారి ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకుని దానిబట్టి పాలసీ కవరేజీ తీసుకోవాలి.
  • మీరు తీసుకోవాలి అనుకున్న భీమాలో ప్రస్తుత వైద్య ఖర్చుల్ని కూడా కలిపి లెక్క వెయ్యాలి.
  • మీకు ఇంతకుముందే హెల్త్ పాలసీ ఉన్నట్లు అయితే టాప్-అప్ ప్లాన్ తీసుకోవచ్చు.