ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్  కొనాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!!

ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్  కొనాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!!
Share

మీరు ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్  కొనాలనుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్త. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఏ వస్తువులు కొన్నా కాస్త అటుఇటుగా ఉన్నా వాడేయవచ్చేమో కానీ ఫుట్‌వేర్ విషయంలో అలా చేయలేము.
ఆన్‌లైన్‌లో చూడగానే బాగా నచ్చింది కదా అని ఫుట్‌వేర్ ఆర్డర్ పెట్టారంటే అప్పుడు మొదలవుతాయి కష్టాలు. ఎందుకంటే మీరు ఆర్డర్ చేసిన ఫుట్‌వేర్ కాళ్లకు సరిపోతాయో లేదో తెలియదు. ఆన్‌లైన్‌లో అయితే సైజుల విషయంలో చాల తలనొప్పులు ఉంటాయి. డ్రెస్సులు, ఫుట్‌వేర్ ఏదైనా కూడా ఖచ్చితం గా సరిపోయే లా దొరకవు.

ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్  కొనాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!!

ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్  కొనే ముందు సైజ్ చార్ట్ చెక్ చేయడం అనేది ఒక మంచి పద్దతి. అసలు ఫుట్‌వేర్ కొలతలు 5 రకాలుగా విభజించబడ్డాయి. సెంటీమీటర్స్, ఇంచెస్, యూకే, యూఎస్, ఈయూ నెంబర్స్ గా ఉంటాయి.

ఇండియన్ ఫుట్‌వేర్ సైజులకు, గ్లోబల్ సైజులకు తేడా ఉంటుంది. ముందుగా ఆ తేడాలు తెలుసుకోవాలి. మీరు ఎప్పుడు ఏ సైజ్ ఫుట్‌వేర్ కొంటారో ఆ సైజ్‌ ని మాత్రమే ఎంపిక చేసుకోండి. కాస్త అటు ఇటుగా ఉన్నా కొనకపోవడంమే మంచిది. అంటే మీ కాలి సైజ్6 అయితే 6.5 మాత్రం తీసుకోవద్దు.

ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్  కొనాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!!

సైజుల విషయానికి వచ్చేసరికి ఒక బ్రాండ్ లో సరిపోయిన సైజు, ఇంకో బ్రాండ్ లో మారిపోతుంది. ఉదాహరణకు ఓ బ్రాండ్‌లో 7 సైజ్ సరిపోవచ్చు. మరో బ్రాండ్‌లో 7 సైజ్ సరిపోకపోవచ్చు. శాండిల్స్, హీల్స్అయితే మరింత జాగ్రత్తగా చూసుకొని ఆర్డరు పెట్టుకోవాలి.

ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్  కొనాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!!
ఆన్‌లైన్‌లో ఫుట్‌వేర్ కొనాలనుకున్నప్పుడు తెలిసిన లేదా వాడుతున్న  బ్రాండ్స్ తీసుకోవడమే మంచిది. ఒకవేళ కొత్త బ్రాండ్ తీసుకోవాలనిపిస్తే  మాత్రం మొదట షాప్ కి వెళ్లి  కొనుక్కోవడం మంచిది. సైజ్ ఏమాత్రం తేడా వచ్చినా  కాళ్లకు, నడవడానికి  కూడా అ సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేముందు ఎక్స్‌ఛేంజ్ లేదా రిటర్న్ చేసే అవకాశం  ఉందో లేదో క్లియర్ గా తెలుకోవడం మంచిది.


Share

Related posts

ఇక లాభం లేదు : భర్త కోసం అన్నయ్య జగన్ ని కలవడానికి సిద్ధమైన షర్మిల ?

arun kanna

Allu aravind – Aha: ఆహా కోసం అందరిని కలిపేస్తున్న అల్లు అరవింద్..!

GRK

టివి సెలబ్రిటీ జగీ జాన్ అనుమానాస్పద మృతి!

Siva Prasad