NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నిప్పులుగక్కిన కొడాలి నాని .. ఎప్పుడూ ఇంత కోపంగా చూసి ఉండరు మీరు !

వైఎస్‌ఆర్‌సిపి ముఖ్య‌నేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మీడియాతో మాట్లాడుతున్నారంటే అందులో సంచ‌ల‌నాలే ఉంటాయి.

 

త‌న‌దైన శైలిలో చేసే ప్ర‌త్యేక కామెంట్ల‌కు సైతం కొడాలి నాని పెట్టింది పేరు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతాం.. ఎవరినైనా ఢీ కొడతాం.. అదరం.. బెదరం.. అని కొడాలి నాని పేర్కొన్నారు. “భారత దేశంలో ఏ వ్యవస్ధ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని రాజ్యాంగంలోనే ఉంది, అయితే కొన్ని వ్యవస్ధలు కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం వాటిలో ఉన్న చిన్నచిన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్ధలను వారి కంట్రోల్‌లో పెట్టుకుని వారికి ఇష్టమైనట్లు, నచ్చినట్లు, కొంతమందికి లాభం చేకూర్చేలా పనిచేయడం, మిగిలిన వ్యవస్ధలు ఏవీ మాట్లాడకూడదు, ఏదీ చూడకూడదు, చూసినా ఎవరికీ చెప్పకూడదు, మేమే సుప్రీం, మా మాట కాదంటే.. ఈ భారతదేశంలోని 135 కోట్ల మంది ప్రజలను మేం ఏమైనా చేయగలం.. అన్న అహంకారపూరితంగా కొన్ని వ్యవస్ధలు ప్రవర్తిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులపై.. భారతదేశంలోని ప్రతి వ్యక్తికీ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ప్రకారం.. దమ్ముగా, ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు ఆసన్నమైంది.“ అంటూ నాని స్పందించారు.

జ‌గ‌న్ చెప్పింది చేశాడు

వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ రోజు వరకూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్ర, దేశ ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని కొడాలి నాని అన్నారు. “జగన్‌ అధికారంలోకి రాకముందు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగింది. చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు వేల ఎకరాలు రాజధాని ప్రకటనకు ముందే కొని లబ్దిపొందారు. ఆ ప్రాంతంలో వారి ఆస్తులను కాపాడుకోవడానికి రాష్ట్ర సంపద అంతా అక్కడే పెట్టి వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో వారి ఆస్తుల విలువ పెంచుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అప్పుడే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, విచారణ చేసి దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వారిని చట్టం ముందు, ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం అని స్పష్టంగా చెప్పాం. దానికనుగుణంగా ఈరోజు విచారణ చేస్తాం.. అంటే చంద్రబాబు బెదిరిపోతున్నాడు.“ అంటూ నాని ఎద్దేవా చేశారు.

సొల్లు క‌బుర్లు చెప్పిన చంద్ర‌బాబు

మీకు దమ్ముంటే సీబీఐ వేయి, సిట్‌ వేయి, సీఐడీ, ఏసీబీ ఎంక్వైరీలు వేయండి .. అంటూ గతంలో ఇదే చంద్రబాబు సొల్లుకబుర్లు చెప్పి బీరాలు పలికాడు అంటూ కొడాలి నాని ఫైర‌య్యారు. “చంద్రబాబు నాయుడు సవాళ్ళు, ఛాలెంజ్ లు నిజమే అనుకుని, అతను నిజాయితీ నిరూపించుకునేందుకు ఒక అవకాశం ఇద్దామని జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా.. అమరావతి ప్రాంతంలో ఎవరెవరు భూములు కొన్నారు, ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎన్ని వేల ఎకరాలలో చంద్రబాబు బినామీలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ చేశారు.. అన్న అంశాలపై నిపుణుల కమిటీ కూలంకుషంగా మార్చిలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది“ అంటూ వివ‌రించారు.

మోదీ ఏం చేయ‌క‌పోవ‌డంతో….

క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని, సీబీఐ ఎంక్వైరీ చేయమని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ కేంద్రానికి లేఖ రాయ‌డంతో పాటుగా ప్రధానమంత్రిని కూడా అడిగారని కొడాలి నాని తెలిపారు. “ఆరునెలలైనా వారు స్పందించకపోతే, ఏసీబీ ఎంక్వైరీ చేసి కేసులు కట్టమంటే… ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి వ్యక్తి దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకి వెళ్ళి నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు, నా పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, కాబట్టి ఈ చార్జిషీట్‌ను, ఎంక్వైరీనిని నిలుపుదల చేయండి అంటూ హైకోర్టుకు వెళితే.. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. మేం దొంగలం, మమ్మల్ని క్షమించండి జగన్‌ గారూ.. అని టీడీపీ చవటలు మందే ఏడవవచ్చు కదా.. గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి దొంగ పనులు చేసి రాజశేఖర్‌రెడ్డి గారి ఇంటికి తెల్లవారుజామున వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను వదిలేయ్‌ మహాప్రభూ అని వేడుకున్నది నిజం కాదా…?. అలాగే చీకట్లో చిదంబరం కాళ్ళను పట్టుకున్నట్లు, రాజశేఖర్‌రెడ్డి గారి కాళ్ళను పట్టుకున్నట్లు, జగన్ కాళ్ళు కూడా పట్టుకుంటే పోయేది కదా, అది చేయలేదు, ప్రగల్భాలు పలికారు“ అంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై నాని కీల‌క వ్యాఖ్య‌లు

త‌మ‌కు న్యాయస్ధానాలు అంటే నమ్మకం ఉందని కొడాలి నాని తెలిపారు. “మీడియా అంటే నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది, అధికారులు అంటే నమ్మకం ఉంది. ప్ర‌స్తుత‌ అంశాన్ని సుప్రింకోర్టులో తేల్చుకుంటాం, అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు పెట్టి దీంట్లో ఇన్‌వాల్వ్‌ అయిన వారు ఎంత పెద్దవారైనా సరే, మాకు ఏమవుతుంది, మేం ఏం అవుతాం అని ఆలోచించకుండా, రాష్ట్ర భవిష్యత్‌ను, ఇక్కడ ఉన్న పేదల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎవరినైనా ఢీకొట్టడానికి జగన్‌ సిద్దంగా ఉన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు, చిన్న చిన్న అడ్డకుంలకు జగన్‌ అదరరు, బెదరరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదరదు, బెదరదు.“ అని వెల్ల‌డించారు.

ఈనాడుపై కూడా…

పెట్రోల్‌, డీజిల్ సెస్‌ పెంచడం వల్ల ప్రజలనెత్తిన బాంబు వేశార‌న్న వార్త‌ల‌పై నాని మండిప‌డ్డారు. “ఈనాడులో మా ప్ర‌భుత్వంపై వార్త‌ రాశారు, మరి మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆరు, ఏడు నెలల్లో పది రూపాయలు పెంచారు, ఎందుకు రాయలేదు? కనీసం గుడివాడ డివిజన్‌ పేపర్‌లో కూడా ఎందుకు రాయలేదు? మోడీ తాటతీస్తాడని భయమా? చంద్రబాబు హయాంలో పెట్రోల్, డిజిల్‌పై రాజధాని పేరుతో రెండు రూపాయల సెస్సు వేస్తానన్నప్పుడు మీ గుడ్డి పేపర్లకు, మీ గుడ్డి టీవీలకు కనిపించలేదా..! అప్పుడు రాజధాని కోసం గొప్పగా ఇంకో రెండు రూపాయిలు వేయమని జనం అడుగుతున్నారని రాసినప్పుడు సిగ్గు అనిపించలేదా!?“ అంటూ దుమ్మెత్తిపోశారు.

లోకేష్ గురించి…

టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కొడాలి నాని అన్నారు. “చంద్రబాబుకు అంటే కరోనా భయం, లోకేష్‌ ట్విట్టర్‌లో ఎందుకుంటాడు? ప్రజల్లోకి రావచ్చు కదా? ఆయ‌నో అసమర్ధుడు, చవట, మూడు శాఖలిచ్చినా మంగళగిరిలో గెలవలేకపోయాడు.“ అంటూ విరుచుకుప‌డ్డారు.

author avatar
sridhar

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N