NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పవన్ కల్యాణ్ పార్టీకి కొత్త పేరు పెట్టిన మంత్రి కొడాలి నాని!పవర్ స్టార్ కు స్ట్రాంగ్ కౌంటర్ !

Kodali Nani Pavan Kalyan: JSP Full Supporting Kodali Nani.. TDP Fears

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.తన శైలిలో పంచ్ డైలాగులు విసిరారు. సోమవారం గుడివాడ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.

నాని పేకాట క్లబ్బులు ఆడిస్తున్నారన్న ఆరోపణ కూడా చేసిన పవన్ కల్యాణ్ ఒక సందర్భంలో బోడిలింగం అంటూ మంత్రిని ఉద్దేశించి అన్నారు.వైసిపి లో నాని లు ఎక్కువయ్యారని ,ఆ.. ఎవరయితేనేం శతకోటి బోడి లింగాల్లో ఒకరని పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ వేసారు.జనసేనాని వ్యాఖ్యలన్నింటిని కొడాలి నాని మంగళవారం తిప్పికొట్టారు.

పవన్ కల్యాణే బోడి లింగం!వకీల్ సాబ్ కాదు షకీలా షాప్!

ఈ రాష్ట్రంలో అతిపెద్ద బోడిలింగం ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కల్యాణే అని మంత్రి పేర్కొన్నారు.బోడిలింగం కాబట్టే ఆయనను రెండు చోట్ల ప్రజలు తిప్పికొట్టారన్నారు. బోడిలింగం ఎవరని అడిగితే భీమవరం గాజువాక ప్రజలు కరక్టుగా చెబుతారన్నారు.తమ పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి జగన్ అతిపెద్ద శివలింగం కాబట్టే ఆయన్ను రాష్ట్ర ప్రజలు అక్కడ కూర్చోబెట్టారన్నారు.వకీల్ సాబు చెప్తున్నాడని జగన్ సాబుకు చెప్పమని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు.ఆయన తనను వకీల్ సాబ్ అనుకుంటాడని కానీ ప్రజలు షకీలా సాబ్ అంటున్నారని పవన్ కల్యాణ్పై మంత్రి సెటైర్ విసిరారు.

తెలుగు శాంతి సేనపార్టీ పెట్టుకోండి!

పనిలో పనిగా మంత్రి పవన్కల్యాణ్ పార్టీ పేరును కూడా మార్చుకోమని సూచించారు.తెలుగు శాంతిసేన అన్న పేరు పెట్టుకుంటే కరెక్టుగా సరిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి జనసేన కూటమిగా కలిసిపోటీ చేయవచ్చునన్నారు.కేఏ పాల్ ప్రజాశాంతి జాతీయ అధ్యక్షుడిగా ను చంద్రబాబు టిడిపి జాతీయ అధ్యక్షుడు గానూ ఉంటారని ఆ కూటమి రాష్ట్ర అధ్యక్షునిగా పవన్ కల్యాణ్ ఉండవచ్చునన్నారు.తాము ఆయన్ను యాక్టర్గానే గుర్తిస్తామని మంత్రి స్పష్టం చేశారు.ప్యాకేజీ అందగానే యుద్ధ విమానంలో వచ్చినట్లు పవన్కల్యాణ్ వచ్చేసి గుడివాడ బందర్ తిరిగేసి ఏదేదో వాగి వెళారన్నారు.

అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్కల్యాణ్ హెచ్చరికను ఆయన ఎగతాళి చేశారు.అసెంబ్లీలో అడుగు పెట్టలేక బయటనుండి ఏదో చేస్తానని ఆయన హెచ్చరిస్తే ఇక్కడ భయపడిపోయే వారెవరూ లేరన్నారు.తుపాను బాధితులకు 35వేలు ఇవ్వాల్సిందేనన్న పవన్ డిమాండ్ ని ప్రస్తావిస్తూ గతంలో చంద్రబాబు రైతులను ముంచేస్తే ఎక్కడో పడుకొని నిద్ర పోయిన చరిత్ర పవన్ కల్యాణ్ దన్నారు.చంద్రబాబును కాపాడటం కోసమే పవన్ కల్యాణ్ ఈ ఆకస్మిక పర్యటన పెట్టుకొన్నారని,బాగా ప్యాకేజ్ అందుకున్నారని మంత్రి ఆరోపించారు.గుడివాడలో నాలుగుసార్లు గెలిచిన చరిత్ర తనదని,పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన దౌర్భాగ్యం పవన్ కల్యాణ్ దని కొడాలి నాని ఎగతాళి చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju