Kodali Nani – Vangaveeti Radha: కొడాలి నాని, వంగవీటి రాధాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స..

Share

Kodali Nani – Vangaveeti Radha: దేశంలో రాష్ట్రంలో మహమ్మారి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్య ప్రజల నుండి రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్న వారు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా ఏపిలో ఏపిలో మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Kodali Nani – Vangaveeti Radha tested covid positive

Kodali Nani – Vangaveeti Radha: ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో చికిత్స

అదే విధంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కూడా కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ణారణ అవ్వడంతో ఆయన కూడా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాధా రీసెంట్ గా నందిగామ నియోజకవర్గంలో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవ్వగా..అక్కడి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రాధాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఇటీవల తనతో కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

మరో పక్క కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన కూడా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనతో పాటు తిరిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. చక్రపాణి రెడ్డి కరోనా బారిన పడటం ఇది రెండో సారి. గతంలో కరోనా బారిన పడి కోలుకున్నారు.

 


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

1 hour ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

6 hours ago