ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక్ ‘ఆది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మూవీలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఫ్యాషన్, మాస్ యాక్షన్ సినిమాలతో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. వి.వి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన మొదటి సినిమాలో జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ మంచి విజయాన్ని సాధించింది. అయితే అంతకుముందే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక రొమాంటిక్ సినిమా చేయాల్సి ఉందని కానీ అది ఆగిపోయిందని ఒక ఇంటర్వ్యూలో వివి వినాయక్ తెలిపారు.
వి.వి వినాయక్ కొడాలి నానిపై కామెంట్స్
ఇంటర్వ్యూలో వి.వి వినాయక్ మాట్లాడుతూ… “నిర్మాత బుజ్జి సహాయంతో ఒక కథ చెప్పడానికి ఎన్టీఆర్‌ని కలిసాను. ‘శ్రీ’ అనే ఒక లవ్ స్టోరీ తీసుకెళ్లాను.
ఎన్టీఆర్ నాకు టైం లేదు 20 నిమిషాల్లో కథ చెప్పేయమని అన్నారు. నేను ఒక ఐదు నిమిషాలు మూవీ ఇంట్రడక్షన్ వినిపించాను. ఆయన రెండు గంటలు కూర్చొని నేను చెప్పే స్టోరీ మొత్తం విన్నారు. లవ్ స్టోరీ ఆయనకు నచ్చింది. సినిమా కూడా చేద్దాం అన్నారు. మొత్తం ఓకే చేశారు కానీ చివర్లో కొడాలి నాని వచ్చి లవ్ స్టోరీ సినిమాలు ఎందుకు? నో చెప్పమని చెప్పారు. కానీ ఆ విషయం ఎన్టీఆర్ నాకు డైరెక్ట్ గా చెప్పలేక సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. దాంతో నేను అర్థం చేసుకొని ఇంకోసారి నాకు టైం ఇవ్వండి ఈసారి ఇంకో కథ చెప్తాను నచ్చకపోతే మొహం మీదనే చెప్పండి పర్లేదు” అన్నాను.
అప్పుడే ఆ మూవీ ఐడియా
“అలా రెండోసారి ‘ఆది’ సినిమా స్టోరీ తో వెళ్ళాను. ఆ కథ విని ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. కొడాలి నాని కూడా కథ విన్నాడు. ఆయనకు కూడా కథ బాగా నచ్చింది దాంతో ఆ సినిమా మొదలైంది. నాకు ‘శ్రీ’ సినిమా కథను రాయటానికి చాలా నెలలు పట్టింది కానీ ఆది సినిమా కథను రెండు రోజుల్లోనే రాశాను. ఆ తర్వాత శ్రీ మూవీ స్టోరీని పక్కన పడేసాను” అని ఓ తాజా ఇంటర్వ్యూలో వి.వి వినాయక్ తెలిపారు.