Special Mask: ఈ మాస్క్ ధర అక్షరాలా రూ.5 లక్షల 70 వేలు..! ఆ మాస్క్ ప్రత్యేకత ఏమిటంటే…!?

Share

Special Mask: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మాస్కుల వ్యాపారం జోరుగా సాగుతోంది. మాస్కుల్లో కూడా ఎన్ 95, కాటన్ మాస్కులు ఎక్కువగా వాడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు పలు కంపెనీలు డిజైనర్ మాస్కులు, ప్రింటెడ్ మాస్కులు ఇలా అనేక రకాల మాస్కులు మార్కెట్ లో తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం మాస్కులు జీవితంలో ఒక భాగమయ్యాయి.  కొందరైతే తమ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రత్యేకంగా ఎక్కువ డబ్బులు వెచ్చించి మాస్కులను తయారు చేయించుకుని వాడుతున్నారు. కొందరు బంగారం, వజ్రాలతో మాస్కులను తయారు చేయించుకుని తమ దర్జాను, దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ బంగారంతో తయారు చేయించున్న మాస్క్ ను ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ మస్క్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Kolkata Business man customised Special Mask worth rs 5-70 lacks
Kolkata Business man customised Special Mask worth rs 5-70 lacks

 

Special Mask: ఆకట్టుకుంటున్న పసిడి మాస్క్

చందన్ దాస్ అనే వ్యాపారి నగల డిజైనర్ సాయంతో తన కిష్టమైన విధంగా బంగారంతో మాస్క్ ను తయారు చేయించుకున్నాడు. అతను ఆ మాస్క్ ధరించి ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఆ మాస్క్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఈ బంగారం మాస్క్ ఫోటోలను ఓ మహిళా జర్నలిస్ట్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో ఇప్పుడు అది వైరల్ అయ్యింది. ఈ మాస్క్ తయారీకి ఆ వ్యాపారి 108 గ్రాముల బంగారం వినియోగించాడని సమాచారం. దాని ఖరీదు రూ.5 లక్షల 70 వేలు గా తెలుస్తోంది. ఇటీవల దుర్గాపూజ సందర్భంగా సదరు వ్యాపారి ఈ బంగారం మాస్కును తయారు చేయించుకున్నట్లు సమాచారం. ఆ మాస్క్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో జనాలు ఆతని వద్ద బారులు తీరుతుండటంతో మాస్కును తీసి దాచుకున్నట్లు తెలుస్తోంది.

 

 


Share

Related posts

గుడ్ న్యూస్ : ఐపీఎల్ కు లైన్ క్లియర్..! ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అంటే…

arun kanna

AP Assembly sessions : ఈ నెల 19 నుండి ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

somaraju sharma

ఆడవారిని ఆకర్షించాలి అంటే మగవాళ్ల లో ఈ లక్షణాలు ఉండి తీరవలిసిందే!!

Kumar