Kollywood heros: టాలీవుడ్ ఇండస్ట్రీ, దర్శకులపై ఫోకస్ పెట్టిన కోలీవుడ్ స్టార్ హీరోలు..!

Share

Kollywood heros: ఈ మధ్యకాలంలో తమిళ హీరోలు మన టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఇక్కడున్న మన స్టార్ డైరెక్టర్స్ మీదా బాగానే ఫోకస్ పెడుతున్నారు. ఎప్పటి నుంచో తమిళ దర్శకులు మన స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. అలాగే తమిళ సూపర్ హిట్ సినిమాలను మన మేకర్స్ రైట్స్ కొనుక్కొని ఇక్కడ ఏ హీరోకు ఐతే ఆ కథ సెట్ అవుతుందో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఇక్కడ రీ మేక్ చేసి హిట్ అందుకుంటున్నారు. హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే తమిళ సినిమాలను మనవాళ్ళు బాగానే రీమేక్ చేస్తున్నారు.

kollywood-heros-are-focusing-on-tollywood-directort
kollywood-heros-are-focusing-on-tollywood-directort

అలాగే తమిళ దర్శకులతోనూ బాగానే సినిమాలు చేస్తున్నారు. కానీ మనవాళ్ళు తమిళ ఇండస్ట్రీవైపు అంతగా వెళుతున్నది గానీ అక్కడ ఫోకస్ చేస్తున్నది గానీ ఇంతకాలం లేదు. ఎప్పుడైతే బాహుబలి తర్వాత మన సినిమాలు పాన్ ఇండియన్ వైడ్‌గా రిలీజ్ అవుతున్నాయో అప్పటి నుంచి హిందీ తమిళంతో పాటు మిగతా సౌత్ భాషల మీద గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. సౌత్‌లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలోనే మార్కెట్ బాగా ఉంటుంది. అందుకే మన హీరోలు అటు ఆ హీరోలు ఇటు వచ్చేందుకు స్ట్రైట్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Kollywood heros: కోలీవుడ్ స్టార్స్ అందరికీ తెలుగులో మంచి ఆదరణ ఉంది.

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. దీనికి తమిళ డైరెక్టర్ ఎన్.లింగు స్వామీ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో రాం చరణ్ ఓ పాన్ ఇండియన్స్ సినిమా చేస్తున్నాడు. తెలుగు తర్వాత చరణ్, నిర్మాత దిల్ రాజు బాగా ఫోకస్ చేస్తుంది హిందీ, తమిళ మార్కెట్స్ మీదనే. అయితే ఇప్పుడు తమిళ హీరోలకి మన టాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమాలు చేయాలని ఇక్కడ మార్కెట్ సొంతం చేసుకోవాలని మంచి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే దాదాపు కోలీవుడ్ స్టార్స్ అందరికీ తెలుగులో మంచి ఆదరణ ఉంది.

వారు నటించిన తమిళ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్‌లను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ధనుష్, విజయ్, శివ కార్తికేయన్ నేరుగా తెలుగు సినిమాలను చేయడానికి కమిటయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ స్ట్రైట్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ వారు నారాయణ్ దాస్, పుష్కుర్ రామ్మోహన రావు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో హిందీతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలవబోతోంది. సాయి పల్లవి ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి.

Kollywood heros: మహేశ్ బాబు చేయాల్సిన కథను కోలీవుడ్ హీరో విజయ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్నాడు.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాల్సిన కథను కోలీవుడ్ హీరో విజయ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకుడు. మహేశ్ కాదన్న కథను విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియన్ మూవీగా బహుభాషలలో వంశీ పైడిపల్లి రూపొందించబోతున్నాడు. ఇక జాతి రత్నాలు సినిమాతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కెవి మరో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌తో ఓ మూవీ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది కూడా శివ కార్తికేయన్‌కు టాలీవుడ్‌లో స్ట్రైట్ మూవీ. శివ కార్తికేయన్ సినిమాలకు మన టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు మన తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ హీరోలంతా తెలుగు ఇండస్ట్రీ మీద, దర్శకుల మీద బాగా ఫోకస్ చేస్తున్నారు.


Share

Related posts

Nagarjuna : నాగార్జున – గోపీచంద్ సినిమాలు ఒకేరోజు రిలీజ్.. డేట్ ఫిక్స్ చేసుకున్న మేకర్స్ ..?

GRK

గ్రేటర్‌ హైదరాబాద్‌లో డివిజన్‌ల వారీ విజేతలు

somaraju sharma

షాకింగ్: టాలీవుడ్ లో దుమారం..! సినిమా షూటింగులపై వాస్తవాలు దాచారా…?

Srinivas Manem