క్రాక్ సినిమా సంక్రాంతి విన్నర్ అని కన్ఫర్మ్ అయిపోయినట్టే అని అంటున్నారు. లాక్ డౌన్ తో ఇండస్ట్రీ మొత్తం క్లిష్ఠ పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెల్సిందే. ఎట్టకేలకి మళ్ళీ 10 నెలల తర్వాత 2021 సంక్రాంతి అందరిలోను ఊపును ఉత్సాహన్ని తెచ్చింది. బరిలో క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్, మాస్టర్ సినిమాలు దిగగా క్రాక్ సినిమా ఈ సంక్రాంతి విన్నర్ అని అంటున్నారు. మిగతా సినిమాలు మూడు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయాయి. కాని krack సినిమా మాత్రం ఇంకా వసూళ్ళ సున్నామీని సృష్టిస్తోంది.
గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ లో ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మిం చాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించారు. అప్సర రాణి స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక థమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో లేవల్ కి తీసుకు వెళ్ళాయి. ఇక krack కథ వాస్తవ సంఘటలన ఆధారంగా తెరకెక్కించారు. పోలీస్ క్యారెక్టర్ raviteja కి మరోసారి బాగా కలిసి వచ్చింది.
మొత్తంగా krack సినిమాకి అన్ని కలిసి వచ్చిన అంశాలే. దాంతో ఈ సినిమా రీమేక్ హక్కులకు భారీ ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ హక్కుల కోసం సోనూ సూద్ ఆల్రెడీ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్ నుంచి కూడా krack సినిమా రీమేక్ హక్కుల కోసం మంచి పోటీ నెలకొందని తెలుస్తోంది. ప్రముఖ బ్యానర్ సంస్థలు krack రీమేక్ హక్కులను కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నారట. మరి ఏ నిర్మాణ సంస్థ రైట్స్ దక్కించుకుంటుందో చూడాలి.