Kollywood: ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న టైంలో చాలావరకు హీరోయిన్లు గ్లామర్ రోల్స్ అదేరీతిలో క్యారెక్టర్ ప్రాధాన్యత కలిగిన పాత్రలకు ఓకే చెబుతారు. ఏ మాత్రం తల్లి పాత్రలకు అదే రీతిలో సైడ్ క్యారెక్టర్ లకు ఎవరూ ఒప్పుకోరు. హీరోయిన్ కెరియర్ యావరేజ్ లో ఉన్నా గాని ఏ మాత్రం తల్లి క్యారెక్టర్ కి ఒప్పుకోరు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ప్రస్తుతం క్రేజ్ ఉన్న గాని తల్లి పాత్ర చేయడానికి రెడీ అయిపోయింది.
విషయంలోకి వెళితే ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. ఒక పక్క పెళ్లి అయిపోయిన గాని స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ డీ-గ్లామరైజ్డ్ పాత్రలు చేయడానికి రెడీ అయిపోయింది. విషయంలోకి వెళితే తమిళంలో రౌడీ బేబీ అనే సినిమా చేయటానికి కాజల్ అగర్వాల్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
Read more: Kollywood: తమిళ హీరోలవైపు తెలుగు దర్శకుల చూపు..!
హారర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో.. హీరోయిన్ తల్లిగా కాజల్ అగర్వాల్ నటించడానికి సై అన్నట్లు వార్తలు వస్తున్నాయి. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా వరకు సీనియర్ హీరోయిన్లు.. ఒకానొక టైంలో ఇండస్ట్రీలో రాణించిన వారు.. రీ ఎంట్రీ చూస్తూ హీరోలకు తల్లిగా లేకపోతే.. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మంచి క్రేజ్ ఉన్న సమయంలో కాజల్ అగర్వాల్ తల్లి పాత్ర చేయడానికి రెడీ అవ్వడం… ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.