తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలను చక్కదిక్కి పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమితులైన మాణిక్ రావు ఠాక్రే పార్టీ నేతలతో నిన్నటి నుండి వరుస సమవేశాలను నిర్వహిస్తున్నారు. అయితే నిన్నటి సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు నేతలు హజరు కాలేదు. అయితే ఈ రోజు మాణిక్ రావు ఠాక్రేతో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైయ్యారు. వీరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చ సాగింది. ప్రధానంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్చించినట్లు తెలుస్తొంది. అదే విధంగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీడీపీ అధినేత చంద్రబాబు అంశాలపైనా కోమటిరెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. టీ కాంగ్రెస్ నేతలు కేవలం వైఎస్ షర్మిల పైనే విమర్శలు చేస్తున్నారు గానీ చంద్రబాబును ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారని తెలుస్తొంది.

కాగా మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అనంతరం కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య చర్చకు వచ్చిన అన్ని అంశాలను బయటకు చెప్పమని అన్నారు. ఏఐసీసీ షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరిగిందని అన్నారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని పేర్కొన్నారు. నాలుగైదు సార్లు ఓడి పోయిన వాళ్లతో తాను కూర్చోవాలా అని ప్రశ్నించారు. తమ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే ఏఐసీసీ పట్టించుకోలేదని అన్నారు. ఫోటోలు మార్పింగ్ చేసిన విషయాన్ని స్వయంగా సీపీయే తనకు ఉత్తమకు చెప్పారన్నారు. నిన్న నియోజకవర్గ పర్యటనలో బిజీగా ఉండటం వల్లనే బుధవారం గాంధీ భవన్ కు వెల్లలేదని చెప్పారు. తాను ఒక్కడినే కాదనీ, సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డిలు కూడా రాలేదనీ, వాళ్లు రాలేదని ఎందుకు అడగరని ప్రశ్నించారు.
