NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Komatireddy: సొంత పార్టీ పరువు తీసేసిన కాంగ్రెస్ ఎంపీ!హుజూరాబాద్ లో దారుణ ఓటమి ఖాయమని తేల్చేసిన కోమటిరెడ్డి!!

Komatireddy: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా తన ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు.ఈ పదవి కోసం కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా పోటీ పడటం తెలిసిందే. ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడంతో వెంకటరెడ్డికి మొండిచేయి ఎదురైంది.దీంతో ఆయన భగ్గుమనడం,టీపీసీసీఅంటే తెలుగుదేశం పీసీసీ అంటూ వ్యాఖ్యానించడం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ కి 30 కోట్ల రూపాయల లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి ఈ పదవి పొందారంటూ ఆరోపించడం కూడా విదితమే.

Komatireddy Venkat Reddy says Congress will lose in Huzurabad
Komatireddy Venkat Reddy says Congress will lose in Huzurabad

స్థానిక గాంధీభవన్ లో అడుగుపెట్టబోనని కూడా వెంకటరెడ్డి శపథం చేశారు.రేవంత్ రెడ్డి కి అంత దమ్ముంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన సవాల్ విసిరారు.ఇదంతా గత చరిత్రే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.రేవంత్ రెడ్డి కి పదవి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో మెరుగుపడలేదని చెప్పటానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో ప్రయత్నం చేశారు.అదెలాగంటే?

ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ కి వచ్చే ఓట్లు 5 శాతం కన్నా తక్కువట!

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపోటములపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి తాను సర్వే చేయించగా 67 శాతం ఓట్లు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వస్తాయని తేలిందన్నారు.30 శాతం ఓట్లు టీఆర్ఎస్‌కు పడేటట్లు ఉన్నాయని కోమటిరెడ్డి తెలిపారు.ఇక తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు 5 శాతం లోపే ఓట్లు వచ్చేలా ఉన్నాయని వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కనుక ముందే అభ్యర్థిని ప్రకటించి కొద్దిగా ప్రచారం ఉధృతం పెంచితే ఇంకొన్ని ఓట్లు అదనంగా రావచ్చునని తెలిపారు.కానీ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపన్నది అసంభవమని మాత్రం వెంకటరెడ్డి చెప్పకనే చెప్పారు.అయితే ఈ ఉప ఎన్నికను తానేమీ పట్టించుకోనని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడేలా చేయటానికి తాను పాటుపడతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.కాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగానే నడుచుకుంటూ ఈ తరహా సర్వే నివేదికను బయట పెట్టారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.తద్వారా రేవంత్ రెడ్డి వల్ల పార్టీ పరిస్థితి మెరుగు కాలేదన్న సంకేతాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన పంపారంటున్నారు.

author avatar
Yandamuri

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N