Subscribe for notification

Konaseema: కోనసీమ నిజాలేమిటి..!? సీఎం అలా చెప్పారు.. పోలీసులు ఇలా చేశారు..!

Share

Konaseema: ప్రశాంతమైన కోనసీమ భగ్గుమంది. ఎన్నడూ లేని విధంగా కోనసీమలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావస్తోంది. అయితే ఈ అల్లర్లకు కారణంగా జనసేన – టీడీపీ కారణం అంటూ అధికార పక్ష నేతలు ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం ఇష్టం లేని వాళ్లు అల్లర్లు సృష్టించారంటూ వైసీపీ ఆరోపించింది. అమలాపురం అల్లర్లకు కారకులైన వారిని గుర్తించి అరెస్టు చేసే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దాదాపు 200 మందికిపైగా పోలీసులు కేసులు నమోదు చేశారు.  వంద మందికిపైగా అరెస్టు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసిన వారిలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వారితో పాటు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. సాక్షత్తు మంత్రి విశ్వరూప్ కూడా ఈ ఆందోళనలో వైసీపీకి చెందిన వారు ఉన్నారనీ, అల్లర్లలో ఎవరూ ఉన్న వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

Konaseema Violence CM Jagan Sensational Comments

Konaseema: వైసీపీ నేతలపై కేసులు నమోదు

ఈ అల్లర్లలో వైసీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలకు చెందిన యువకులు ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడి అవుతుండగా, కోనసీమ అల్లర్లు ప్రతిపక్షాల కుట్ర అని, జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం ఇష్టం లేక వాళ్లు ఆందోళనలు చేసి మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు నిప్పు పెట్టారని రీసెంట్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. మూడు వారాల తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అమలాపురం ఘటనపై స్పందించి మాట్లాడారు. మరో పక్క అమలాపురం అల్లర్లకు సంబంధించి మంత్రి విశ్వరూప్ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా మంత్రి విశ్వరూప్ అనుచరులు, వైసీపీకి చెందిన నాయకులు వాసంశెట్టి సుభాష్, రాయిడి సత్యరుషి, మట్టపర్తి మురళీకృష్ణ, రఘులపై కేసు నమోదు చేశారు.

 

వీళ్లు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీళ్లు విశ్వరూప్, సీఎం జగన్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోనసీమను రాజకీయంగా రగిల్చి బీఆర్ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేసి ఒక వర్గాన్ని అనుకూలంగా మరుల్చుకుని ఒక వర్గాన్ని శత్రువుగా చేసే అనేక రాజకీయ కోణాలు దీనిలో ఉన్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కంగారు పడి అశాంతికి గురి కాకుండా ఎందుకు జరిగింది..ఝ దీని వెనుక ఎవరు ఉన్నారు..ఝ అనే దానిపై మూలాల్లోకి వెళ్లి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరు చేయాల్సి ఉంటుంది.


Share
Special Bureau

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

7 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

1 hour ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

3 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago