NewsOrbit
న్యూస్

Konijeti Rosaiah: రోశయ్య ఎక్కిన శిఖరాలకు మెట్లు పరిచిన చీరాల !ఆయన చరిత్రలో క్షీరపురికో ప్రత్యేక అధ్యాయం!

Konijeti Rosaiah: స్వర్గస్తులైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంతటి ఉన్నత స్థానానికి చీరాల నుండే ఎదిగారు.గుంటూరు జిల్లా వేమూరు నుండి వచ్చిన రోశయ్యను చీరాల ప్రజలు అక్కున చేర్చుకుని అందలం ఎక్కించటం వల్లే ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు అన్నది నిర్వివాదాంశం.అందుకే రోశయ్య రాజకీయ చరిత్రలో చీరాలకో ప్రత్యేక అధ్యాయం వుంది.

Konijeti Rosaiah garu started his  political career From Chirala
Konijeti Rosaiah garu started his political career From Chirala

Konijeti Rosaiah: అపజయమే విజయానికి సోపానం!

విద్యాభ్యాసం అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసిన రోశయ్య అడుగులు చీరాలవైపు పడ్డాయి. 1967 లో తొలిసారిగా ఆయన చీరాల నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి ప్రగడ కోటయ్య చేతిలో 1500ఓట్ల తేడాతో ఓడిపోయారు.అయినా చీరాలనే తన రాజకీయ స్థావరంగా మార్చుకొని ఆయన పని చేసుకుంటూ వెళ్లారు.తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు.అన్ని వర్గాలకు చేరువయ్యారు.

Konijeti Rosaiah: 1989 లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక!

చీరాల లో 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.అయితే 1994 ఎన్నికల్లో మాత్రం టిడిపి అభ్యర్థి పాలేటి రామారావు చేతిలో మూడువేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.1996 లో ఆయన నర్సరావుపేట ఎంపీగా గెలుపొందారు.

సొంత నియోజకవర్గంలో ఓటమి!

1999 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన చీరాల రాకుండా సొంత ఊరైన వేమూరు నుండి పోటీ చేసి అక్కడ పరాజయం పొందారు.ఆ ఎన్నికల్లో చీరాల రాలలో బీసీకి చెందిన మహిళా అభ్యర్థికి సీటు ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయించడంతో రోశయ్యకు అవకాశం రాలేదు.గోల్ అంజలీదేవికి చీరాల టిక్కెట్ రాగా ఆమెను పాలేటి రామారావు ఓడించారు.అలాగే రోశయ్య వేమూరులో పోటీచేసి ఓటమిపాలయ్యారు

2004 లో బ్యాక్ టు చీరాల

2004 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి చీరాల చేరుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పాలేటి రామారావును ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడించారు.తద్వారా పాలేటి మీద ప్రతీకారం తీర్చుకున్నారు.అయితే రోశయ్యకు వయసు మీద పడటంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక ప్రత్యక్ష ఎన్నికలు వద్దని సలహా ఇచ్చి ఆయనను శాసనమండలికి పంపారు.

వేమూరు వారైనా వేరుగా చూడలేదు

రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన సీఎం అయ్యారు.ముఖ్యమంత్రిగా దిగిపోయాక తమిళనాడు గవర్నర్ అయ్యారు.పిసిసి అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. ఇలా రోశయ్య ఎక్కని శిఖరాలు లేవు.కానీ చీరాల అందుకు మెట్లు పరిచింది.వేమూరు వారైనప్పటికీ చీరాల ప్రజలు రోశయ్యను వేరుగా చూడలేదు.ఈ రోజు రోశయ్య మరణవార్త విని చీరాల కన్నీరు పెడుతోందంటే ఆయనపట్ల ఇక్కడ ప్రజానీకానికి ఉన్న ప్రేమాభిమానాలను అర్థం చేసుకోవచ్చు..

 

author avatar
Yandamuri

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju