ఆచార్య కంటే ముందే శ్రీకాంత్ కొడుకుతో కొరటాల సినిమా ..మెగా ఫ్యాన్స్ పరిస్థితేంటి..?

ప్రస్తుతం సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పొందిన దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాని రూపొందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు తనయుడు మెగా పవర్ స్టార్ కూడా నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Acharya' First Look: Megastar Chiranjeevi stands tall in the new poster of  his upcoming film

కాగా రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలవబోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై ఐదు రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసింది. అల్లు అరవింద్ ఆహా కోసం కొరటాల ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నట్టు సమాచారం. టినేజ్ లవ్ వల్ల లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందనే పాయింట్ తో కొరటాల కథను రాసాడని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్‌ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా కొరటాల అసిస్టెంట్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మెగాస్టార్ అంటే శ్రీకాంత్ కి ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. సొంత అన్నయ్య కంటే ఎక్కువగా భావిస్తాడు శ్రీకాంత్. ఇప్పుడు తన కొడుకు తో వెబ్ సిరీస్ నిర్మిస్తున్నందుకు మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట.