Koratala siva: కొరటాల శివ – ఐకాన్ స్టార్ ప్రాజెక్ట్ ఉంది కానీ..!

Share

Koratala siva: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎంతో ఆశగా ఉన్నారు. అందుకు కారణం ఆయన వరుసగా దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటూ రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబడుతుండటమే. అందుకే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఛాన్స్ ఇచ్చారు. ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్.టి.ఆర్‌లతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల ఇప్పుడు మెగా మల్టీస్టారర్ ఆచార్యతో మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

koratala-siva-allu arjun project is there
koratala-siva-allu arjun project is there

అయితే ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా ప్రాజెక్ట్స్ అన్నీ తారుమారయ్యాయి. పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుండటంతో అల్లు అర్జున్ కంప్లీట్‌గా ఆ ప్రాజెక్ట్‌లో లాకయ్యాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆచార్య సినిమాతో కొరటాల శివ లాకయ్యాడు. దాంతో వీరి కాంబోలో ప్రాజెక్ట్ డిలే అయింది.

Koratala siva: కొరటాల పాన్ ఇండియన్ సబ్‌జెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు.

ఆచార్య తర్వాత కొరటాల శివ ఎన్.టి.ఆర్‌తో నెక్స్ట్ సినిమాను చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుంది. అందరూ వీరి కాంబోలో సినిమా క్యాన్సిల్ అయిందని చెప్పుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం బన్నీ – కొరటాల చేస్తున్న ప్రాజెక్ట్స్ తర్వాత ఈప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందుకోసం కొరటాల పాన్ ఇండియన్ సబ్‌జెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే ఓ ఏడాదిన్నర పడుతుందని సమాచారం. కానీ, వీరి కాంబోలో ప్రాజెక్ట్ మాత్రం పక్కా.


Share

Related posts

‘స్పీకర్ కుర్చీలో మజ్లిస్ ఎమ్మెల్యేనా!?’

Siva Prasad

బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా విష్ణు ప్రమాణ స్వీకారం

somaraju sharma

Liger : లైగర్ వచ్చేస్తున్నాడు ..పూరి ప్లాన్ మారలేదు ..!

GRK