బ్రేకింగ్: కరోనాతో మృతి చెందిన ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణుగోపాల్

ప్రముఖ టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు. కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు టివి, సినీ నటులు అయిన కోసూరి వేణుగోపాల్ చనిపోయారు.

 

kosuri venugopal dies of COVID19
kosuri venugopal dies of COVID19

 

గత 22 రోజులుగా ఆయన గచ్చిబౌలిలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెలలో ఆయనకు కరోనా సోకింది. కోసూరి వేణుగోపాల్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఎఫ్సీఐలో మేనేజర్ స్థాయిలో రిటైర్ అయ్యారు వేణుగోపాల్. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో అవకాశాలు సంపాదించారు. రిటైర్ అయ్యాక కూడా నటించారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, పిల్ల జమిందార్, ఛలో వంటి సినిమాలతో వేణుగోపాల్ ప్రేక్షుకులకు సుపరిచితుడే. ఆఖరుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అమీ తుమీ సినిమాలో నటించారు.