17.2 C
Hyderabad
December 5, 2022
NewOrbit
ట్రెండింగ్ న్యూస్

నేను జులైలో పుట్టా.. అందుకే జులాయి గాడిని.. వామ్మో కోట కౌంటర్లు మామూలుగా లేవు?

kota srinivasa rao and babu mohan in alitho saradaga
Share

వామ్మో.. విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు మామూలు పంచులు వేయరుగా. ఆయన ఏజ్ పెరిగింది కానీ.. ఆయనలో ఉన్న నటుడు, ఆయనలో ఉన్న హాస్యం మాత్రం పోలేదు. ఈ వయసులోనూ ఆయన హుషారు చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు ముచ్చటేస్తుంది.

kota srinivasa rao and babu mohan in alitho saradaga
kota srinivasa rao and babu mohan in alitho saradaga

ఇటీవల ఆలీతో సరదాగా అనే షోకు కోట వెళ్లారు. కోట అంటే మనకు గుర్తొచ్చే మరో పేరు బాబు మోహన్. అవును.. ఇద్దరు కలిసి ఆ షోకు గెస్టులుగా వెళ్లారు. ఇద్దరు కలిసి ఓసారి తాము కలిసి నటించిన సినిమాల గురించి నెమరు వేసుకున్నారు.

అయితే.. కోట శ్రీనివాస రావు మాత్రం.. అప్పుడు ఎలా ఉన్నారో… ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏమాత్రం మారలేదు. తన వాక్చాతుర్యం.. తన హుషారు.. ఆలీనైతే ఓ ఆట ఆడుకున్నారు కోట.

బాబాయ్ అని ఆలీ పిలిస్తే.. ఎవరు బాబాయ్.. ఇంటర్వ్యూకు పిలిచి బాబాయ్ అని పిలుస్తున్నావేంటి అంటూ ఆలీకి కౌంటర్ ఇచ్చారు కోట. సారీ కోటా గారు.. అంటూ వెంటనే ఆలీ అనడం.. బాబు మోహన్ గురించి కూడా కొన్ని నిజాలను కోట.. ఆలీతో పంచుకున్నారు.

దానికి సంబంధించిన ఎపిసోడ్ ను తాజాగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. మొత్తానికి కోట మాత్రం మామూలుగా పంచులు వేయడం లేదు. నేను జులైలో పుట్టాను కాబట్టే జులాయినయ్యాను అంటూ షోలో మామూలు పంచులు వేయలేదు కోట.

ఇంకెందుకు ఆలస్యం… ఆలీతో కోట, బాబు మోహన్ సరదా సంభాషణను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..


Share

Related posts

లాక్ డౌన్ పై తిరగబడ్డ కూలీలు

Siva Prasad

Bigg Boss Telugu 5: ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులకు బిగ్గెస్ట్ ట్విస్ట్ సెట్ చేసిన బిగ్ బాస్..??

sekhar

పోలీస్ శాఖపై అలిగిన మంత్రి అఖిలప్రియ

somaraju sharma