NewsOrbit
న్యూస్ సినిమా

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇంత దిగజారుడా..! తప్పుడు ప్రచారంపై కోటా శ్రీనివాసరావు ఫైర్

Share

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, కథనాలు నిత్యం వస్తూనే ఉంటాయి. అందుకే ఏ వార్త నిజమో అబద్దమో తెలుసుకోవాలంటే ప్రజలకు కొంత సమయం పడుతోంది. నిజం గడప దాటే లోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందన్న సామెత ఉంది. అందుకే అబద్దపు ప్రచారాలు క్షణాల్లో వివరీతంగా సెర్క్యులేట్ అవుతుంటాయి. ఇవి చాలా మందిని బాధిస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనంగా నిలుస్తుంది.

kota srinivasrao

 

తాజాగా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందినట్లుగా వార్త  సోషల్ మీడియాలో సెర్క్యులేట్ అయ్యింది. ఈ వార్త నిజమేమోనని నమ్మి చాలా మంది సంతాపం ప్రకటిస్తూ ఆర్ఐపీ అంటూ మెసేజ్ లు పెట్టారు. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవం. పలువురు నేరుగా కోటా శ్రీనివాసరావు నివాసానికి  ఫోన్ చేయడంతో అసలు విషయం తెలిసింది. ఈ ప్రచారంపై కోటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తాను చనిపోయినట్లుగా వార్తలు రావడం బాధకారమని అన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు.

రేపటి ఉగాది పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న తనకు వరుస ఫోన్ కాల్స్ రావడం ఆందోళన కల్గించిందన్నారు. ఏకంగా పది మంది పోలీసులు భద్రత కోసం తన నివాసానికి వచ్చారని కోటా ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయనీ, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. ప్రజలు అర్ధం చేసుకుని తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు .. సీబీఐపై సుప్రీం కోర్టు సీరియస్


Share

Related posts

Amritha Aiyer Latest Wallpapers

Gallery Desk

Prabhas : “ఇంటికి వచ్చి మరీ కొడతా రా ఒరేయ్” ప్రభాస్ ఫ్యాన్ కి రాధేశ్యామ్ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్ !

Ram

చిరంజీవికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..!!

sekhar