Kota srinivasa rao: అందుకు ప్రత్యక్ష సాక్ష్యం కోట శ్రీనివాసరావు.

Share

Kota srinivasa rao: విలక్షణమైన నటనకి కోట శ్రీనివాసరావు మరో పేరు. పోషించే పాత్ర ఏదైనా అందులో ఆయన కనిపించరు. ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. విలనిజానికి కొత్త అర్థం చెప్పిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. తండ్రి పాత్ర పోషించినా, తాత పాత్ర పోషించినా తనలా మరే నటుడు చేయలేడు అని గట్టి ముద్ర పడేలా తనలోని నటుడుని ఎప్పటికప్పుడు, ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చారు. ప్రముఖ, దర్శక, నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం ఇది ఆయన తప్ప మరెవరూ చేయలేరు అని చాటి చెప్పేలా ప్రతీ పాత్ర ద్వారా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్న గొప్ప నటులు.

kota-srinivasa-rao is the eye witness
kota-srinivasa-rao is the eye witness

కోట శ్రీనివాస రావు నాటక రంగం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చారు. దాదాపు 20 ఏళ్ళు నాటక రంగంలో ఉన్నారు. ఈ 20 ఏళ్ళలో కోట ఎన్నో నాటకాలు వాటిలో విభిన్నమైన పాత్రలు పోషించారు. నాటక రంగలో ఆయనకి ఉన్న పేరు అసాధారణం. ఇదే ఆయనకి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేసింది. క్రాంతి కుమార్ అనే దర్శకుడు కోట వేసిన ఓ నాటకం చూసి ఆయన తెరకెక్కించిన సినిమాలో అవకాశం ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఆ నటకాన్నే క్రాంతి కుమార్ సినిమా తీయడం అందులో నాటకం వేసిన వారినే తీసుకోవడం గొప్ప విషయం.

Kota srinivasa rao: ఏ ఒక్క అవకాశాన్ని ఇది నా వల్ల కాదు అని వదిలిపెట్టలేదు.

కోట శ్రీనివాస రావు మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఇందులో చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమాలో కోట చేసిన పాత్ర బాగా నచ్చడంతో ఆయనకి వరసగా అవకాశాలు వచ్చాయి. ప్రతిఘటన, బాబాయ్ అబ్బాయ్, ఆహ నా పెళ్ళంట సినిమాలు కోటా సత్తా ఏంటో చూపించాయి. సినిమా సినిమాకి సంబంధం లేని పాత్రలు చేసే అవకాశం వస్తున్నా ఏ ఒక్క అవకాశాన్ని ఇది నా వల్ల కాదు అని వదిలిపెట్టలేదు. చిన్న చిన్న పాత్రనైనా, తెరమీద కనిపించేది కొద్దిసేపే అయినా అందులోనే తన మార్క్ చూపించారు. చూపులు కలసిన శుభవేళ, ఖైదీ నంబర్ 786, యముడుకి మొగుడు లాంటి సినిమాలు ఆయన నటనని విభిన్నంగా చూపించాయి.

చెవిలో పువ్వు, హై హై నాయక, బావా బావా పన్నీరు, బావా బావమరిది, శివ లాంటి సినిమాలు కోట శ్రీనివాస రావు కెరీర్ లో ముఖ్యమైన సినిమాలు. ఒకవైపు కమెడియన్‌గా కామెడీ పాత్రలు చేస్తూనే మరొకవైపు నెగిటివ్ రోల్స్ ..విలనీ రోల్స్ చేస్తూ ఆయనని కొట్టే నటుడు ఇప్పట్లో రాడేమో అన్న విధంగా పేరు తెచ్చుకున్నాడు. రాజా విక్రమార్క, బొబ్బిలి రాజా, చెవిలో పువ్వు, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలోని పటేల్ పాత్ర శత్రువు సినిమాలోని వెంకటరత్నం పాత్ర గొప్ప పేరు తెచ్చాయి.

Kota srinivasa rao: పరభాషా నటులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేనంతగా కోటకి దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇచ్చారు.

కోట కెరీర్ లో మరో గొప్ప సినిమా రౌడీ అల్లుడు. ఇందులోని పాత్ర కలకాలం నిలిచిపోతుంది. చిత్రం భళారే విచిత్రం, ఆమె, హలో బ్రదర్, ఘటోత్కచుడు, అల్లుడా మజాకా, గణేష్, అన్నయ్య, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, గన్ షాట్, బొంబాయి ప్రియుడు ఇలా వరుస సినిమాలతో ఆయన క్షణం తీరిక లేకుండా గడిపాడు. పరభాషా నటులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేనంతగా కోటకి దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇచ్చారు.

బద్రి, అవును వాళ్ళిద్దరి ఇష్టపడ్డారు, సంతోషం, ఇడియట్, అతడు, ఛత్రపతి, బొమ్మరిల్లు, రాఖీ, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే..ఈ సినిమాలలో కోటా శ్రీనివాస రావు పోషించిన ఎమోషనల్ క్యారెక్టర్స్‌కి గొప్ప పేరొచ్చింది. విలన్ పాత్రల్లో భయపెట్టిన కోట, కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఎమోషనల్ సీన్స్‌లో కళ్ళు వాచేలా ఏడిపించారు. ఇన్ని వేరియేషన్స్ ఇచ్చిన నటులు ఇండస్ట్రీలో ఎంతో అరుదుగా ఉంటారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం కోట.


Share

Related posts

రివ్యూ : ఆర్జీవీ ‘కరోనా’

siddhu

‘రేషన్ కార్డులు, పెన్షన్లు పునరుద్ధరించాలి’

somaraju sharma

పాన్ ఇండియన్ సినిమాగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ ..?

GRK