NewsOrbit
న్యూస్

దేశంలో సంపన్న మహిళలు జాబితా ఇదే..! ఆ సంస్థల షాకింగ్ నిజాలు బయటకు..!!

 

మహిళలే మహారాణులు అన్నారు పెద్దలు. అలంటి మహారాణులకే మహారాణి గా నిలిచారు అత్యంత సంపన్న మహిళలు. కోటక్ వెల్త్ మేనేజ్‌మెంట్, హురున్ ఇండియా అనే సంస్థలు తాజాగా వెల్లడించిన నివేదికలో భారత్ దేశ టాప్ 100 మంది మహిళా సంపద సృష్టికర్తల
జాబితాను విడుదల చేసారు.‘కోటక్‌ వెల్త్‌ హురున్‌ – లీడింగ్‌ వెల్దీ వుమెన్‌ 2020’ నివేదిక ప్రకారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా దేశంలోనే  అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఆ తరువాతి స్థానాలలో కిరణ్‌ మజుందార్‌ షా(బయోకాన్ ఛైర్ పర్సన్), లీనా గాంధీ తివారి (యూఎస్‌వీ ఛైర్‌పర్సన్) ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల సంపదను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక తయారీలో కుటుంబ వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిగణనలోకి తీసుకున్నారు.

 

kotak wealth hurun leading wealthy women 2020

 

ఈ నివేదిక లో మొదటి ముగ్గురు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బయోకాన్‌, యూఎస్‌వీ ఛైర్‌పర్సన్లు కాగా, నాలుగో స్థానం హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ డైరెక్టర్ మహిళ నీలిమా మోటపార్తికి దక్కింది.ఆమె సంపద రూ.18,620 కోట్లు. జోహోకు చెందిన రాధా వెంబు (5 వ స్థానం), అరిస్టా నెట్‌వర్క్‌ సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌ (6వ స్థానం), హీరో ఫిన్‌కార్ప్‌కు చెందిన రేణు ముంజాల్ (7 వ స్థానం), అలెంబిక్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈఓ మాలికా చిరాయు అమిన్‌ (8వ స్థానం), థర్మక్స్‌కు చెందిన అను ఆగా, మెహర్‌పుదుంజీ (9వ స్థానం), ఫల్గుని నాయర్, కుటుంబం (10 వ స్థానం) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే 100 మంది జాబితాలో, 13 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణా రాష్ట్రాలకు చెందిన వారు.  హైదరాబాద్‌కు చెందిన 32 ఏళ్ల అంజనా రెడ్డి (యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌) ఈ జాబితాలో స్థానం సంపాదించటం ప్రత్యేకత. అత్యంత ధనిక మహిళల్లో ఎక్కువ మంది ముంబయిలో ఉన్నారు. ఆ తర్వాత దిల్లీ, హైదరాబాద్‌కు చెందిన వారికి ఈ జాబితాలో స్థానం లభించింది.

roshni nadhar manjudhar shahleena gandhi thivari neelima metparthi

మనదేశంలో సంపద సృష్టిలో గత రెండు దశాబ్దాల్లో మహిళల పాత్ర విస్తృతం అయినట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సీఈఓ దాస్‌ పేర్కొన్నారు. 2020- కోటక్‌ వెల్త్‌- హురున్‌ ఇండియా సంపన్న మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్న మహిళల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన విజయగాథగా ఆయన అభివర్ణించారు. ఈ జాబితా చూసి ఎంతోమంది మహిళలు ఉత్తేజితులై మరింతగా ఎదగడానికి, సంపద సృష్టించడానికి ప్రయత్నిస్తారనే ఆశాభావాన్ని హురున్‌ ఇండియా ఎండీ అనస్‌ రెహ్‌మాన్‌ అభిప్రాయపడ్డారు.

ధనిక మహిళల్లోని మొదటి 100 మంది సగటు  సంపద రూ.2,72,540 కోట్లు అని నివేదిక తెలిపింది. మొత్తం ఎనిమిది మంది డాలర్ బిలియనీర్లు ఉండగా, జాబితాలో 38 మంది మహిళలు రూ.1,000 కోట్లు, అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో మహిళల సగటు వయస్సు 53 సంవత్సరాలు. 69 మంది సంపద సంరక్షకులు కాగా, 31 మంది స్వయంగా పైకొచ్చిన మహిళలు ఉన్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!