Krack : క్రాక్ సినిమాకి ముందు రవితేజ మార్కెట్ మొత్తం చాలావరకు పడిపోయింది. 2017 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాకి ముందు కూడా రవితేజ కి అంత సక్సస్ లు లేవు. అయితే రాజా ది గ్రేట్ తో రవితేజ భారీ హిట్ అందుకున్నాడు. దాంతో అందరూ మళ్ళీ రవితేజ సక్సస్ ట్రాక్ ఎక్కాడని అనుకున్నారు. కాని రవితేజ బ్యాడ్ టైం వల్ల రాజా ది గ్రేట్ తర్వాత వచ్చిన నేల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా వరసగా భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి.
ఈ దెబ్బకి రవితేజ మార్కెట్ పడిపోయింది. కమిటయిన కొన్ని సినిమాలు కూడా డ్రాపయినట్టు వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా రవితేజ క్రాక్ తో భారీ హిట్ అందుకున్నాడు. చెప్పాలంటే కరోనా సమయంలో 50 పర్సెంట్ ఆక్యూపెన్సీ తో కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం గొప్ప విషయం. ఈ సినిమా కి వచ్చిన వసూళ్ళు కూడా ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక ఈ సినిమాతో రవితేజ కి వచ్చిన సక్సస్ అండ్ క్రెడిట్ అంతా ఇంతా కాదు. దాంతో ప్రస్తుతం ఖిలాడి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Krack : క్రాక్ సినిమాకి ముందు రవితేజ ట్రాక్ రికార్డ్ బాగా లేదు.
అయితే క్రాక్ సినిమాకి ముందు రవితేజ ట్రాక్ రికార్డ్ బాగా లేకపోవడం తో అనుకున్న బడ్జెట్ కంటే తగ్గించి ఖిలాడి సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. కానీ క్రాక్ హిట్ తో ఇప్పుడు రవితేజ మార్కెట్ పెరిగింది. దాంతో ఇప్పుడు ఖిలాడి బడ్జెట్ ని పెంచినట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్స్ ని తెరకెక్కించనున్నారు. అందుకే ఇప్పుడు అనుకున్నదానికంటే బడ్జెట్ డబుల్ చేసినట్టు సమాచారం. నిర్మాతలు కూడా ఇప్పుడు రవితేజ కి వచ్చిన క్రేజ్ కారణంగా బడ్జెట్ కి వెనకాడడం లేదని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.