క్రాక్ .. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా. ఈ సినిమాతో రవితేజ – గోపీచంద్ మలినేని ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నారని పిచ్చ క్లారిటీగా ఉన్నారు. అందుకు కారణం ఈ సినిమాకి జరిగిన బిజినెస్ అని ఇండస్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. krack విషయంలో ఇది ఏ రకంగా చూసుకున్నా మిరాకిల్ అని చెప్పాలి. కరోనా సమయంలో అన్నిటీకీ తెగించి సినిమాని కంప్లీట్ చేశారు. ప్రమోషన్స్ ని వీర లెవల్ లో చేస్తున్నారు. లిరికల్ సాంగ్స్.. పోస్టర్స్.. ని వరసగా వదులుతూ krack మీద జనాలలో భారీగా అంచనాలు పెంచేశారు.
ఇక మ్యూజిక్ విషయంలో థమన్ కూడా తన సత్తా ని మరోసారి చూపించాడు. ఒక్కో పాటని మించి ఒక్కో పాట సూపర్ హిట్ గా నిలిచాయి. లిరికల్ సాంగే ఇంత హిట్ అయితే రేపు థియేటర్స్ లో విజువల్ గా చూస్తుంటే ఆడియన్స్ ని ఆపడం కష్టం అని చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది krack బిజినెస్. ఈ సినిమాకి ముందు వేసుకున్న బడ్జెట్ 25 కోట్లు కాగా ఆ తర్వాత మరో 5 కోట్లు అయిందట. అంటే krack సినిమా బడ్జెట్ మొత్తం 30 కోట్లు. అయితే రవితేజ కి గత కొంతకాలంగా రవితేజ సినిమాలన్ని వరసగా ఫ్లాప్ అవుతున్న ఉన్న కారణంగా 30 కోట్లు వసూలు చేస్తుందా అని మాట్లాడుకున్నారు.
కాని ఇప్పుడు krack సినిమాకి అయిన బిజినెస్ ఇప్పటికే వచ్చిన ప్రాఫిట్ తో ఒక్కొక్కరి మైండ్ బ్లాక్ అవుతుందట. థియేట్రికల్ రిలీజ్ హక్కులు, నాన్ థియేట్రికల్ హక్కులు హిందీ డబ్బింగ్, స్టార్ మా సాటిలైట్ హక్కులు ఇలా మొత్తం బిజినెస్ 42 కోట్లకి పైగానే జరిగిందని లేటెస్ట్ అప్డేట్. ఏ రకంగా చూసుకున్నా krack లాభాలలో ఉన్నట్టే. ఇక సినిమా రిలీజయ్యాక ఎంత వసూళ్ళు రాబడుతుంది అన్నది సక్సస్ టాక్ ని బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పుడు krack బిజినెస్ చూసి సంక్రాంతి బరిలో దింపాలనుకున్న కొన్ని సినిమాలు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో లాభాలు రావని తప్పుకున్నాయి. ఇప్పుడు వాళ్ళందరు జీవితంలో ఇలాంటి పొరపాటు చేయకూడదని ఫీలవుతున్నారట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?