Krishna Dccb : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మచిలీపట్నంలోని The Krishna district cooperative central bank limited వివిధ పోస్టుల భర్తీకి కృష్ణాజిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ది కృష్ణ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 118 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
మొత్తం ఖాళీలు : 118పోస్టులు
1. స్టాఫ్ అసిస్టెంట్ : 72 పోస్టులు (ఇందులో మహిళలకు 26 పోస్టులు)
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి.పరీక్ష సమయం 1 గంట.
2. అసిస్టెంట్ మేనేజర్ : 28 పోస్టులు
ఎంపిక విధానం : ఈ పోస్టులకు ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 1 గంట. ఇంటర్వ్యూ 12.5మార్కులకు నిర్మిస్తారు ఈ పరీక్షలో కూడా రుణాత్మక మార్కులు ఉంటాయి.
3.పిఏసిఎస్ స్టాప్ : 18 పోస్టులు (ఇందులో మహిళలకు 8 పోస్టులు)
ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
అర్హతలు :
గ్రాడ్యుయేషన్ పూర్తి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ తెలుగులో ప్రొఫిషియన్సీ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. కృష్ణా జిల్లా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయసు: 1/1/2021 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. బీసీ అభ్యర్థులు లకు మూడు సంవత్సరాలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల గరిష్ట వయస్సు లో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ :31/1/2021
పరీక్షా కేంద్రాలు : విజయవాడ, మచిలీపట్నం, ఆగిరిపల్లి, మైలవరం, పెడన, గుడ్లవల్లేరు.
వెబ్ సైట్: https://www.krishnadccb.com