NewsOrbit
న్యూస్

కిడ్నీ రోగులతో నిండిపోతున్న కృష్ణాజిల్లా!మూడు వందల గ్రామాలలో ప్రమాద ఘంటికలు!!

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం అంటే తెలియని వారు ఉండరు .అదేదో పుణ్యక్షేత్రమని కాదు.కిడ్నీ రోగుల స్థావరం అది.అప్పట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్దానం సమస్య ను తెరపైకి తెచ్చారు.ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించినట్లే కనిపించారు.

ఆ తర్వాత ఏం జరిగిందనే పక్కనబెడితే ఇప్పుడు కృష్ణా జిల్లాలోని 13 మండలాలను కిడ్నీ మహమ్మారి చాప కింద నీరులా చుట్టేసింది. జనం ప్రాణాలను బలికోరుతోంది. తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలను కిడ్నీ వ్యాధి వణికిస్తోంది. ఇక్కడి తాండాల్లో కిడ్నీ రోగులు చాలామందే ఉన్నారు. ఇంతకీ ఈ కిడ్నీ రోగాలకు కారణం ఏంటి…? పచ్చని గ్రామాలను కిడ్నీ వ్యాధి ఎందుకు కాటేస్తోంది అంటే కారణం నీళ్లు… అవును ప్రాణం నిలబెట్టే జీవజలం ఇక్కడ విషంగా మారింది. నీళ్లలోని ఫ్లోరైడ్ వీళ్ళ ప్రాణాలు తోడేస్తోంది.

ప్లోరైడ్ నీటిని తాగడంతో కిడ్నీలు పాడవుతున్నాయి. రక్షిత నీరు అందుబాటులో లేకపోవడంతో వ్యాధి ప్రబలింది. ముందుగా ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పితో మొదలవుతోంది. ఏదో చిన్న సమస్యలే అనుకుంటారు. కానీ తేరుకునేలోగానే అంతా అయిపోతుంది. కిడ్నీలు పనికిరాకుండా పోతాయి.తమకు కిడ్నీ రోగం ఉందని తెలిసే సరికే కొందరికి ప్రాణం మీదికొస్తోంది. కూలి పనులకు వెళ్లలేక చాలా మంది ఇంట్లోనే కూలబడుతున్నారు. మరో విచిత్రం ఏమంటే నిరక్షరాస్యత వీరిని మరో రోగంగా వెంటాడుతోంది. డయాలసిస్ కు వెళితే చనిపోతామన్న భయం చాలా మంది రోగుల్లో కనిపిస్తోంది. మందులు వాడాలన్నా.. డయాలసిస్ కు వెళ్లాలన్నా మరికొందరి వద్ద డబ్బు లేదు. పేదరికం వాళ్ళను చావు వైపు తీసుకు పోతోంది. కొందరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. మరికొందరు ఒక కిడ్నీతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు చచ్చిపోయారు.

కొన్ని ఇళ్లల్లో అమ్మా, నాన్న చనిపోయి పిల్లలు అనాథలయ్యారు. మరికొన్ని ఇళ్లల్లో చేతికి అందివచ్చిన కొడుకులు అర్థాంతరంగా మరణించారు. తల్లిదండ్రులకు బతుకు భారంగా మిగిల్చారు.కొందరికి ప్రభుత్వ సాయం అరకొరగా దొరుకుతోంది. చాలా మందికి అది అందని ద్రాక్షే. నిరక్షరాస్యత వల్ల వాళ్లు ప్రభుత్వ సాయం కూడా పొందలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఆశా వర్కర్లు కొంత సాయం చేస్తున్నారు. ఏ తాండాలోకి వెళ్లినా ఇవే కథలు. కన్నీటి గాథలు. ఏ ఇంటిని పలకరించినా ఇదే వ్యధ. ఏ గడప తొక్కినా చావుకబురే.. కడుపు తరుక్కుపోయే విషాదాలు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. 300 గ్రామాల్లో ఇవే దృశ్యాలు. గుండెలను పిండేసే ఆర్తనాథాలు! ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పుకునే జగన్ ప్రభుత్వం ఈ విషయమై దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N