NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణా జిల్లా టిడిపి సీనియర్లను టెన్షన్ పెట్టిస్తున్న సొంత పార్టీ నేత..??

ఏపీ రాజకీయాలలో కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అని చాలామంది చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన తర్వాత గానీ చాలా వరకు టిడిపి ఎటువంటి ఎన్నికలు వచ్చినా భారీ స్థాయిలో స్థానాలు ఈ జిల్లాలో గెలుచుకుంటది. అంతమాత్రమే కాకుండా టిడిపికి వెన్ను దన్నుగా ఉండే సామాజిక వర్గాలు చాలావరకూ ఈ ప్రాంతంలోనే ఉండటం వల్లే చంద్రబాబు.. అమరావతిని రాజధాని గా గుర్తించడం జరిగిందని కూడా చెబుతుంటారు.

Vangaveeti Radha to leave YSRCP?అటువంటి కృష్ణా జిల్లాలో టిడిపి సీనియర్ లకు సొంత పార్టీలో ఉన్న ఒక నాయకుడు టెన్షన్ పుట్టిస్తున్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో సరికొత్తగా వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణా జిల్లా టిడిపి సీనియర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు టాక్ వస్తోంది. వంగవీటి రంగా తనయుడిగా పాలిటిక్స్ లో అడుగుపెట్టిన రాధా మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.

 

2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపిలో ఉన్న వంగవీటి రాధా.. టిడిపి ఓడిపోయిన తర్వాత పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటి పరిస్థితిలు యామి వాస్తవం లో కనబడలేదు. పైగా చంద్రబాబు రాధా కి ప్రాధాన్యత ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. రాధా కి దగ్గరగా ఉండే వ్యక్తులకు టికెట్లు కేటాయించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమరావతి ఉద్యమం విషయంలో కీలకంగా రాణిస్తున్న టిడిపి…అమరావతి పై సామాజిక వర్గం ముద్రవేసిన ప్రత్యర్థుల ఎత్తుగడలను తుడిచి వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లే అమరావతి ఉద్యమానికి సంబంధించి కీలక కార్యక్రమాల్లో వంగవీటి రాధా నీ ముందుండి నడిపించే రీతిలో చంద్రబాబు స్కెచ్ వేసినట్లు, ఈ దెబ్బతో అమరావతి రాజధాని పై అధికార పార్టీ వేస్తున్న కుల ముద్ర తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇదే తరుణంలో రాధా కూడా కుల ప్రస్తావన తీసుకు వస్తూ చేస్తున్న ప్రసంగాలు టిడిపి పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకొచ్చే విధంగా ఉన్నట్లు ఇప్పటికే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. దీంతో కృష్ణా జిల్లా టిడిపి పార్టీలో ఎప్పటినుండో ఉన్న సీనియర్లకు.. చంద్రబాబు వంగవీటి రాధా కి ఇస్తున్న ప్రాధాన్యత చూసి టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju