Krishnashtami 2021: కృష్ణాష్టమి రోజున ఇలా పూజిస్తే సరి.. !

Share

Krishnashtami 2021: ఓవైపు శుభకార్యాలు.. ఇంకోవైపు పూజాధి కార్యక్రమాలతో శ్రావణమాసం పూర్తయ్యేంత వరకూ భారత దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక శ్రావణమాసంలోని కృష్ణాష్టమి సంబరాలు పండగ వాతావరణాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఈ పవిత్ర దినాన స్వామివారి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఈరోజున చిన్నారులు అల్లరి గోపికమ్మలు, కన్నయ్యలుగా అవతారమెత్తుతారు. శ్రీకృష్ణపరమాత్మ జన్మించిన ఈ రోజున ప్రతి తల్లి తనని తాను యశోదగా భావించి పూజలు చేస్తుంది. ఈ పర్వదినాన పూజలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు. ఈ దినాన ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం.

పూజా విధానం:

కృష్ణాష్టమి పర్వదినాన పొద్దున్నే లేచి తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మాలకు పరిశుభ్రమైన పచ్చటి మామిడి తోరణాలు కట్టాలి. తర్వాత కృష్ణుడిని నిష్ఠగా పూజించాలి. దేవుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు చిన్ని పాదముద్రలు వేయాలి. మనకు ఎంతో ప్రియమైన కృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి పంచామృతాలతో అభిషేకం జరిపించాలి. ఆ తర్వాత కృష్ణుడిని గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించాలి. ఈ పవిత్ర కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం కృష్ణుడి విగ్రహానికి పట్టు వస్త్రాలు తొడగాలి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన తులసీదళాలతో తయారుచేసిన మాలతో సహా ఇతర ఆభరణాలు చక్కగా అలంకరించాలి.
Tooth Powder: ఈ పళ్ళపొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు మిలమిల మెరిసిపోతాయి..!!

ఈ పరమాత్ముడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి లాలిపాటలు, కీర్తనలతో పూజలు చేయాలి. తరువాత కృష్ణ లీలా సమయంలో కృష్ణుడికి మిక్కిలి యిష్టమైన పారిజాత పువ్వులను ఉపయోగించాలి. పూజా కార్యక్రమాల సమయంలో శాకాహార ఆహార పదార్థాలతో దేవుడికి నైవేద్యం పెట్టాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన అటుకులు, వెన్న సమర్పిస్తే మంచిదని పురోహితులు చెబుతుంటారు.

RATION CARD : రేషన్ కార్డు కొరకు అప్లై చేయాలి అని అనుకుంటున్నారా…అయితే ఇది మీ కోసం…!


Share

Related posts

అయోధ్య కేసు మళ్లీ వాయిదా

somaraju sharma

ఢిల్లీ ప్రార్థనల్లో 800 మంది ! తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరగనున్నాయా ?

Siva Prasad

AP Government:  ఏపి ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ ..! ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు భరోసా..!!

somaraju sharma