Krishnavamsi: మూడేళ్ళు కష్టపడి తీసిన ఆ సినిమా చూసి కృష్ణవంశీని తిట్టని వాళ్ళులేరు.

Share

Krishnavamsi: పసుపులేటి కృష్ణవంశీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కృష్ణవంశీ ఒక ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ ఉంది. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ శిష్యుడుగా పరిచయమైనా కూడా ఆయన సినిమాలతో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. కృష్ణవంశీ ప్రతీ సినిమా ఓ వైవిధ్యం. సామాజిక అంశానికి పక్కా కమర్షియల్ ఫార్మాట్ తో సినిమా తీయడంలో ఆయనకి ఆయనే సాటి. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా వాళ్ల ఇమేజ్‌కి తగ్గట్టు సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటారు.

krishnavamsi nakshatram movie was a big disaster
krishnavamsi nakshatram movie was a big disaster

సినిమా విషయంలో కాంప్రమైజ్ కాని తత్వం. అందుకే గులాబి, అంతపురం, మురారి, ఖడ్గం లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఆయన నుంచి వచ్చాయి. రాం గోపాల్ సొంత బ్యానర్ వర్మ కార్పొరేషన్ లోనే ‘గులాబి’ సినిమాకి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో తనేంటో కృష్ణవంశీ ప్రూవ్ చేసుకున్నాడు. ఓ డైరెక్టర్ సాంగ్స్ తీసే విధానంతో ఆకట్టుకొని సినిమా అవకాశం అందుకోవడం చాలా అరుదుగా జరిగే విషయం. అదే కృష్ణవంశీ విషయంలో జరగడం ఆసక్తికరమైన విషయం. గులాబీ సినిమాలోని పాటల చిత్రీకరణ చూసి, కృష్ణవంశీకి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చారు. ఆ సినిమానే ‘నిన్నే పెళ్ళాడుతా’. ఈ సినిమా అఖండ విజయాన్నందుకుంది. టబుకి ఊహించనంతగా క్రేజ్ వచ్చింది.

Krishnavamsi: అంతఃపురం కృష్ణవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ.

కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా’ తరువాత ‘ఆంధ్రా టాకీస్’ పేరుతో సొంతగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో ‘సింధూరం’ సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించలేదు. నాగార్జున హీరోగా కృష్ణవంశీ తీసిన చంద్రలేఖ ఫ్లాప్ అయినా కూడా మంచి పేరు తీసుకు వచ్చింది. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే సముద్రం సినిమా మేకింగ్, గానీ సాంగ్స్ గానీ కృష్ణవంశీకి మంచి పేరు తీసుకు వచ్చాయి. ఇక అంతఃపురం కృష్ణవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ.

సూపర్ స్టార్ మహేష్ బాబు – సోనాలి బేంద్రే తో కృష్ణవంశీ తీసిన మురారీ భారీ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్ఠించింది. అలాగే ఖడ్గం సినిమా ఇదే రేంజ్‌లో హిట్ సాధించింది. ఈ రెండు సినిమాలతో కృష్ణవంశీ రేంజ్ దేశవ్యాప్తంగా ఊహించని విధంగా మారిపోయింది. ఇక కృష్ణవంశీ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న తర్వాత ప్రభాస్‌తో తీసిన చక్రం, నితిన్ తో చేసిన శ్రీ ఆంజనేయం ఆశించిన స్థాయిలో హిట్ అవలేదు.

Krishnavamsi: అంతగా ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఆ తర్వాత చిన్న బడ్జెట్‌తో డేంజర్ సినిమా తీశాడు. ఈ సినిమా కృష్ణవంశీ నే తీశాడా అనే టాక్ వచ్చింది. అయితే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తీసిన రాఖీ, తర్వాత చందమామ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్స్. ఇక వరుసగా హీరోయిన్‌గా ఛార్మిని రిపీట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్. ఇక కృష్ణవంశీ నుంచి శశిరేఖా పరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలు కృష్ణవంశీ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. ఆ తర్వాత వచ్చిన మెగాపవర్ స్టార్ రాం చరణ్ – కాజల్ తో తీసిన గోవిందుడు అందరి వాడేలే భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. దాంతో భారీ హిట్ కొట్టాలని మూడేళ్ళు ఎంతో కష్టపడి నక్షత్రం తీశాడు. ఈ సినిమా చూసి కృష్ణవంశీని తిట్టుకున్న వాళ్ళే ఎక్కువ. అంతగా ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.


Share

Related posts

బ్రేకింగ్: అనాథలుగా మారిన చిన్నారులు.. ఆదుకుంటానన్న సోను సూద్

Vihari

ఆ సమయంలో ఆడవారి దగ్గర ఇలా మాత్రం ఉండకండి!!

Kumar

‘ఓం’ కనిపించింది – 2020 దరిద్రం వదిలిపోయింది.

Naina