Krithi Shetty : శర్వానంద్ గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక చాలా సతమతమవుతున్నాడు. తాజాగా విడుదలైన అతని ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా డీసెంట్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. అతను నెక్స్ట్ చల్ మోహన రంగా ఫేమ్ కృష్ణ చైతన్యతో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Krithi Shetty : కృతితో ఘాటైన రొమాన్స్
కృతి శెట్టి మొదటి సినిమాతోనే వైష్ణవి తేజ్ తో సెగలు పుట్టించే రొమాన్స్ చేసి అదరగొట్టింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ తన బోల్డ్ యాక్టింగ్ తో ఆమె ఆడియన్స్ ను స్టన్ అయ్యేలా చేసింది. ఇక శర్వానంద్ (Sharwanand)తో కూడా అమ్మడు ఇదే లెవెల్ లో రొమాన్స్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఆమెను హీరోయిన్ గా తీసుకున్నట్లు అధికారిక సమాచారం ఏమీ లేదు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం కృతి చేస్తున్న సినిమాలు ఏంటి
ప్రస్తుతం కృతి శెట్టి “ఆ అమ్మాయి గురించి మీరు చెప్పాలి”, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ వంటి మూడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే శర్వానంద్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ రోల్ అందుకునే అవకాశం ఉంది. ఆ అమ్మాయి గురించి మీరు చెప్పాలి సినిమాలో కృతి డాక్టర్ అలేఖ్య పాత్ర పోషిస్తోంది. నాగార్జున, అక్కినేని నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయస్సు కేవలం 18 ఏళ్లే. ఈ వయసులోనే టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఆమె మంచి అవకాశాలు దక్కించుకుంటుంది,