Kriti Shetty: మెగా కాంపౌండ్‌లో కృతిశెట్టి..రష్మిక మందన్న, పూజా హెగ్డేలను మించిపోతుందా..?

Share

Kriti Shetty: మెగా కాంపౌండ్‌లో ఓ హీరోయిన్ గనక చేరిందంటే ఇక ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. దానికో ఓ లెక్క ఉంది. అదేమిటంటే యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు అందుకోవచ్చు. అందుకు ఉదాహరణ కాజల్ అగర్వాల్, తమన్నా లాంటివారే. కాజల్ అగర్వాల్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన మగధీర సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది.

kriti-shetty-in mega compound
kriti-shetty-in mega compound

ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150లో ఇప్పుడు ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తమన్నా కూడా చరణ్‌తో రచ్చ, పవన్ కళ్యాణ్‌తో కెమెరామాన్ గంగతో రాంబాబు, అల్లు అర్జున్‌తో బద్రీనాథ్, చిరంజీవితో సైరా సినిమాలో నటించిన తమన్నా.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో మరోసారి చిరు సరసన నటిస్తోంది. ఇప్పుడు వీరి సరసన యంగ్ బ్యూటీ కృతిశెట్టి చేరింది. మెగా మేనల్లుడు డెబ్యూ సినిమా ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఇప్పటికే మెగా హీరోయిన్ అనిపించుకుంది.

Kriti Shetty: హీరోయిన్‌గా కృతిశెట్టిని నిహారిక ఎంచుకుందని సమాచారం.

ఉప్పెన సినిమా తర్వాత అరడజను సినిమాలు సైన్ చేసి యంగ్ హీరోయిన్స్‌కు షాకిచ్చింది. అంతేకాదు ఇప్పుడు మెగా డాటర్ నిహారిక నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మించడానికి రెడీ అయింది. ఈ క్రమంలోనే ఓ లేడీ సెంట్రీక్ మూవీని నిహారిక నిర్మించబోతోందట. ఇందులో హీరోయిన్‌గా కృతిశెట్టిని నిహారిక ఎంచుకుందని సమాచారం. అఫీషియల్‌గాను త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందట. ఇదే నిజమైతే ఖచ్చితంగా రష్మిక మందన్న, పూజా హెగ్డేలను ఈజీగా డామినేట్ చేసేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

Krishna River: కృష్ణానదికి భారీగా వరద నీరు..! చిక్కుకుపోయిన వందకుపైగా ఇసుక లారీలు..!!

somaraju sharma

Nikki Tamboli lovely images

Gallery Desk

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి

somaraju sharma