Kritika Rohini:  కృత్తిక,  రోహిణి  నక్షత్ర నాలుగు పాదాల లో పుట్టినవారి లక్షణాలు !!

Share

Kritika Rohini: కృత్తిక నక్షత్ర ప్రధమ పాదం గురువు కి చెందినది. దాన, ధర్మాలు  చేసేవారు, డబ్బున్నవారు ,శక్తి సామర్ధ్యాలు కలిగినవారు , పనులలో నైపుణ్యం ఉన్నవారుగా అగును.కృత్తిక నక్షత్ర రెండవ పాదం శనిది గా చెప్పబడింది. ఇందులో పుట్టినవారు మొహమాటం లేనివారుగా, పాపు పనులు  చేయువారు, వేశ్యా   గృహాలలో ఉండేవారు గా  వీరి గురించి చెప్పబడింది.కృత్తిక నక్షత్ర మూడవ  పాదం కూడా  శనిది అని చెప్పబడింది.  చెడు స్నేహాలు ఉన్నవారు, పని లో నైపుణ్యం ఉన్న కూడా  మంద బుద్ధులుగా  వ్యవహరించేవారిగా ,  దుష్టులతో సహవాసం చేసేవారు అగును.కృత్తిక నక్షత్ర  నాల్గవ  పాదం గురువు కి చెందినది. విద్యా  వినయం కలిగినవారు, ధర్మాత్ములుగా ఉంటూ , ధార్మికులుగా వ్యవహరించి ,  ఎప్పుడు సంతోషం  గా ఉండువారు అవుతారు.

Kritika Rohini:  రోహిణి నక్షత్ర నాలుగు పాదాల లో పుట్టినవారు

రోహిణి నక్షత్ర మొదటి  పాదం కుజుడిది గా చెప్పబడింది.  స్థిరత్వం లేనివారు , ఎర్రని జుట్టు ఉన్నవాడు , శూరుడు వంటివాడు , గొడవలంటే   ఇష్టం కలిగినవాడు,నిష్టూరపు మాటలు మాట్లాడేవాడిగా ఉంటారు.రోహిణి నక్షత్ర రెండవ  పాదం శుక్రుడిది గా చెప్పబడింది. పొడవైన  దేహం ఉన్నవాడు, ఓటమిని  ఒప్పుకోలేని మనస్తత్వం కలవారు.. మంచి నడవడిక కలవారిగా ఉండును.రోహిణి నక్షత్ర మూడోవ  పాదం బుధుడిది గా చెప్పబడింది. పండితులు , కవులు , గణిత శాస్త్రజ్ఞులు,  లోక వ్యవహారమందు  మంచి జ్ఞానం  కలిగి ఉంటారురోహిణి నక్షత్ర నాల్గవ పాదం చంద్రుడి కి చెందినది. ఇతరుల కు చెందిన సొమ్ము మీద  ఆశపడేవారు,  తెలివితేటలు కలిగినవారుగా, బుద్ధిమంతులు,    మంచివారుగా ఉంటారు.


Share

Related posts

రక్షాబంధన్ రోజు అమోఘమైన తీర్పు ! అదేమిటంటే?

Yandamuri

ఏకాదశి నాడు పేలాల పిండి ఎందుకు తింటారో మీకు తెలుసా ?

Sree matha

Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నిక‌… ఇప్ప‌ట్లో లేన‌ట్లే

sridhar