Kruthi shetty : టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి.. ముద్దుగుమ్మ ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదూ.. మన బేబమ్మ స్కూల్ కి వెళ్ళే వయసులోనే కొన్ని వాణిజ్య యాడ్స్ లో చేసింది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటిసారి ఓ దుస్తుల వాణిజ్య ప్రకటనలో పాల్గొంది. ఆ తరువాత లైఫ్ బాయ్, డైరీ మిల్క్ చాక్లెట్ తో పాటు పెన్నుల కంపెనీ యాడ్ లో కూడా ఆమె నటించారు.. హృతిక్ రోషన్ కథానాయకుడిగా 2019 లో విడుదలైన సూపర్ 30 లో ఓ సన్నివేశం లో కనిపించింది.
టాలీవుడ్ లో కృతి శెట్టి కి వరుస సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈ భామను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో రానున్న సినిమాలో కృతి శెట్టి ని కథానాయికగా ఎంపిక చేశారు . కేవలం ఒకే ఒక్క సినిమాతో వరుసగా మూడు భారీ చిత్రాల్లో అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ..