NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్ బుక్క‌యిన‌ట్లేనా? వాళ్లంద‌రు ఎందుకు క‌లుస్తున్నారంటే…

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురించి కొత్త చ‌ర్చ న‌డుస్తోంది. హోరా హోరీగా సాగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ప్ర‌చార ప‌ర్వం మొత్తం త‌న భుజాల‌పై వేసుకున్న ఈ యువ‌నేత ఆ స‌మ‌యంలో చేసిన కామెంట్లు , ప్ర‌స్తుతం వెలువ‌డిన ఫ‌లితాలు, అనంత‌రం కావాల్సిన రాజ‌కీయ లెక్క‌ల గురించే ఈ టాక్‌. ప్ర‌చారంలో చేసిన కామెంట్ ప్ర‌త్య‌ర్థుల‌కు చిక్కేలా చేసిందంటున్నారు.

కేటీఆర్ ఏమ‌న్నారంటే..

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని.. మేయర్ పీఠంపై కూర్చోబోయే వ్యక్తి ఎంఐఎం పార్టీకి చెందిన వారేనని బీజేపీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అలాంటిది ఏమీలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఫ‌లితాలు సీన్ మార్చేశాయి. గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మరోసారి సత్తా చాటింది. 44 స్థానాల్లో విజయం సాధించింది మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అదే స‌మ‌యంలో గ్రేటర్‌లో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎంఐఎం కీలకంగా మారింది. ఆ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చిన పార్టీ వారే మేయ‌ర్ అభ్య‌ర్థి కానున్నారు.

ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఫలితాలను అర్థం చేసుకోవాలి, గౌరవించాలని ఒవైసీ పేర్కొన్నారు. గ్రేటర్‌లో బీజేపీ విజయం తాత్కాలికం మాత్రమేనని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఫలితాలు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేసిన ఒవైసీ… రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఫలితాలు ప్రకటించిన తర్వాత పార్టీలో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

కేటీఆర్ కీల‌క స‌మావేశం

ఇదిలాఉండ‌గా, గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఊహించిన విజయాన్ని అందుకోలేకపోవ‌డంతో టీఆర్ఎస్ పార్టీ ఏం చేయ‌నుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఎక్స్‌అఫిషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మరొకరి సాయం తీసుకోకుండా మేయర్ పీఠం ఎక్కలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక సమావేశానికి సిద్ధమయ్యారు.తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉండగా… పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా? అనే చర్చ సాగుతోంది. ఒక‌వేళ ఎంఐఎంతో పొత్తు గురించి నిర్ణ‌యం తీసుకుంటే గ‌తంలో ఎదురుదాడి చేసిన విప‌క్షాలు మ‌ళ్లీ కేటీఆర్‌ను ఈ అంశంలో బుక్ చేస్తాయా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

author avatar
sridhar

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!