ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయుడు కల్వకుంట్ల తారకరామారావు తండ్రి అడుగుజాడలలోనే నడుస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే 104 మంది అభ్యర్థులను ఒకే సారి ప్రకటించిన కేసీఆర్ సంచలనం సృష్టిస్తే…సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే కేసీఆర్ తెరాస తరఫున లోక్ సభకు పోటీ చేసే తొలి అభ్యర్థి పేరు ప్రకటించేశారు.

రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ లోక్ సభ అభ్యర్థిగా వినోద్ పేరును కేసీఆర్ ఈ రోజు ప్రకటించారు. వినోద్ సిట్టింగ్ ఎంపీ.  సిరిసిల్ల లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా బోయిన్ పల్లి వినోద్ ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేస్తారని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవ ఎన్నికకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల రూపాయలు కానుకగా అందిస్తుందన్నారు.