NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

Revanth Vs KTR:  తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటలు యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. చేవెళ్ల సభ వేదికగా బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క లోక్ సభ స్థానం గెలవండి చూద్దాం అంటూ సవాల్ చేశారు. రేవంత్ సవాల్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ తీవ్రంగా స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి మన ఇద్దరం పోటీ చేద్దామని… ఎవరెంటో తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు.

‘రేవంత్ రెడ్డి… నువ్వు ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసి మల్కాజిగిరి కి వచ్చి పోటీ చేయి చూసుకుందాం. నేనూ పోటీ చేస్తాను. నువ్వు కొడంగల్ రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్లలో రాజీనామా చేసి వస్తాను. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు గెలవాలని సవాల్ విసిరారు కదా… అక్కడ ఇక్కడ కాదు. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం. సేఫ్ గేమ్ వద్దు.. స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. నీ సిట్టింగ్ సిట్ లోనే పోటీ చేద్దాం’ అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.

చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని కేటిఆర్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని, కార్యకర్తల అండ ఉన్నంత సేపు ఈ కుర్చీని ఎవరూ తాకలేరని వ్యాఖ్యానించారు. తాను అయ్యపేరు చెప్పుకుని సీఎం కుర్చీలో కూర్చోలేదు. అల్లాటప్పాగాన్నీ కాదు..నల్లమల్ల అడవి నుండి మెట్టుమెట్టు ఎదిగి సీఎం అయ్యానని అన్నారు.

ప్రజలు బొంద పెట్టినా కేటిఆర్ కు బుద్ది రాలేదని మండిపడ్డారు సీఎం రేవంత్. అడవి పందుల్లా తెలంగాణను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అంటే వాళ్లను ఊర్లల్లో చెట్టుకు తలకిందులుగా వేలాడదీయాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రానివ్వకుండా పోరాడాలని కార్యకర్తలకు సూచించారు.

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N