NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇక తెలంగాణ లోనూ జగన్ ఫార్ములా…! కేటీఆర్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామానికి ఒక సచివాలయం తో పాటు అక్కడి ఆఫీసర్లకు సహకరించేందుకు గ్రామ వాలంటీర్లను నియమించి… ప్రజలను అధికారులతో నేరుగా అనుసంధానం చేసే వ్యవస్థ ను జగన్ తీసుకొని వచ్చారు. ఇక పట్టణాల్లో అయితే వార్డు వాలంటీర్ అక్కడి ప్రజలకు కావాల్సిన సేవలను తక్షణమే అందేలా చూస్తున్నారు.

కొద్ది మార్పులతోతెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి అధికారులనే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మున్సిపల్ శాఖ పై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక ఆఫీసర్ ని నియమించే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఏపీ లో మాత్రం వాలంటీర్లు గా చలామణి అవుతున్న వారు ప్రభుత్వ అధికారులు కాదు.

ఇక తెలంగాణలో వార్డు ఆఫీసర్లు అనేవారు పురపాలక చట్టం నిర్దేశించిన పారిశుద్ధ్యం హరితహారం తో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వస్తున్న కొత్త మున్సిపల్ చట్టం ఎప్పటి నుండో అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా కారణం మీద అమలుచేయడానికి ఆలస్యం అవుతున్నప్పటినుండి ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా అధికారుల సిస్టమ్ ని కేటీఆర్ అమలు చేయబోతున్నాడు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉన్న చట్టం ప్రకారం మొక్కలకు ప్రజాప్రతినిధులు ఇంతకుముందు బాధ్యులను చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం పాలన సాగాలంటే పర్యవేక్షణ వ్యవస్థ ఉండాల్సిందేనని ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగి అవసరం తెలుసుకున్న కేటీఆర్ వార్డు ఆఫీసర్ల ఉద్యోగాలను సూచిస్తున్నట్లు నిర్ణయించుకున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న కేటీఆర్ ఇటీవల కాలంలో తన శాఖలో మాత్రమే కాకుండా మొత్తం పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పాలనలో అనూహ్య మార్పులు తీసుకు వస్తూ.. కరోనా సమయంలో చురుగ్గా పర్యటిస్తూ…. అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు ఇక కొన్ని వేల కోట్లతో హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్లై ఓవర్లను ప్రారంభించి ఆ పనులు జోరుగా సాగేలా చూస్తున్నారు. ఇక ఈ సమయంలో అక్కడక్కడ జగన్ ను ఫాలో కావడమ్ అనివార్యమైపోయింది.

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!