స్పీడు పెంచిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెరాస అధినేత కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు స్పీడ్ పెంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధించిన మరుసటి రోజునే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందిన తారకరామారావు…తన బాధ్యతల నిర్వహణలో జోరు పెంచారు.

పార్టీ శ్రేణులలో వరుస భేటీలతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా దూసుకుపోతున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధమైపోతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పార్టీని మరోసారి ఘన విజయం వరించేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. అదే సమయంలో కొప్పుల ఈశ్వర్, వివేక్ వంటి నేతల మధ్య విభేదాల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఇరువురు నేతలతోనూ ఈ రోజు తెలంగాణ భవన్ లో చర్చలు జరిపి విభేదాలు విస్మరించి పార్టీ కోసం కలిసి పని చేయాలని ఇరువురికీ చెప్పారు. అలాగే ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలి పార్టీ నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే నెల 25 వరకూ జరిగే ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.