Subscribe for notification

KTR: అగ్నిపథ్ పథకాన్ని అందుకే తీసుకువచ్చారా..? తెలంగాణ మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు

Share

KTR: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. వివిధ రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్మీ అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నా కేంద్రం మాత్రం ఈ పథకం అమలుపై తగ్గేదె లే అంటోంది. అగ్నిపథ్ నియామకాల కోసం త్రివిధ దళాధిపతులు ఇప్పటికే షెడ్యుల్ కూడా ప్రకటించారు.  అయితే అగ్నిపథ్ పథకంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ అవినతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టి మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా అని కేటిఆర్ ప్రశ్నించారు.

KTR key comments on agnipath issue

 

శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును ఆదానీ గ్రూపు దక్కించుకుంది. ఆదానీ గ్రూపుకు విద్యుత్ ప్రాజెక్టు దక్కేలా శ్రీలంక ప్రభుత్వంపై మోడీ ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టు ను ఆదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పై మోడీ ఒత్తిడి తెచ్చారంటూ సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం అయ్యింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఆ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోడీపై భగ్గుమన్నాయి. మరో పక్క శ్రీలంకలో మోడీ, ఆదానీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని కేటిఆర్ ఇంతకు ముందే బీజేపీని, మోడీని పశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదానికి ముడి పెడుతూ డైవర్షన్ పాలిటిక్సా అన్నట్లుగా కేటిఆర్ ట్వీట్ చేశారు.


Share
somaraju sharma

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

21 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

51 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

1 hour ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago