NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Ktr : తెలంగాణలో నిరుద్యోగులు పండగ చేసుకునే వార్త చెప్పిన కేటీఆర్..!!

Ktr : టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ మరోపక్క మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చో బోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

 KTR told the news that the unemployed will celebrate the festival in Telangana .. !!
KTR told the news that the unemployed will celebrate the festival in Telangana .. !!

ఈ క్రమంలో ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నాయకులు మరియు కొంతమంది మంత్రులు కేటీఆర్ జపం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలతో పాటు పాలన విషయంలో కూడా సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు పండగ చేసుకునే వార్త కేటీఆర్ ప్రకటించారు. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిరుద్యోగ భృతి కల్పించడానికి ప్రభుత్వం రెడీ అయినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని పేర్కొన్నారు. విద్యుత్ కార్మికుల సంఘాల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే మరిన్ని ఉద్యోగ నియామకాలు జరుగుతాయని కేటీఆర్ హామీ ఇచ్చారు. పిల్లల పుట్టుక నుంచి వాళ్ళు బడికి వెళ్లే అంతవరకు వాళ్లపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

అదేవిధంగా చదువుల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ కల్పించడం మాత్రమే కాక విదేశాలకు వెళ్ళే వారికి కూడా ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తున్నట్లు తాజాగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక త్వరలోనే నిరుద్యోగులకు .. సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్లు తాజా సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో ఈ వార్త తెలుసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరికొంత మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని.. అలా చేస్తే మరింతగా నిరుద్యోగులకు మేలు చేసిన వారవుతారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించడం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju