15నుండి అర్ధకుంభమేళా

ఉత్తరప్రదేశ్, జనవరి 14: ప్రయాగ్ రాజ్ ‌లో మంగళవారం నుండి ప్రారంభం కానున్న అర్ధ కుంభమేళా మహాక్రతువుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపట్టింది. మకర సంక్రమణం నుండి మార్చి నాలుగున మహాశివ రాత్రి పర్వదినం వరకు మేళా జరుగుతుంది.
ప్రత్యేక రోజుల్లో రాజయోగ స్నానాలు ఉంటాయి.
ఈనెల 15న ఉదయం 5.15 గంటలనుండి సాయంత్రం 4.20 గంటలవరకు ప్రత్యేక రాజయోగ స్నానానికి యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఘాట్‌లను సిద్ధం చేసింది.
నాగ సాధువులు ప్రత్యేకంగా తరలిరానున్నారు.
కుంభ్ కోసం ప్రత్యేక విమానాలను నడపనున్నారు.