NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

అక్కడ టీడీపీని తాకట్టు పెట్టేశారా..!? కుప్పంలో చంద్రబాబును ముంచిందెవరు..!?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది ..? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలవడంతో ఆ పార్టీ దూకుడు పెంచింది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ చెబుతోంది. అక్కడి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధి అని ఇప్పటికే పెద్దిరెడ్డి చెప్పేశారు. ఈ నేపథ్యంలో  ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి ఏలా ఉంది..? చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ఏమైనా చేపట్టారా ? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అసలు కుప్పంలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది..? చంద్రబాబు ఏమి చేయనున్నారు..? ఆయన ప్లాన్స్ ఏమిటి ..?అనేది ఒక సారి పరిశీలిస్తే..

 

నమ్ముకున్న నాయకుల తప్పిదాలతో..

ఆరు సార్లు ప్రాతినిధ్యం వహించిన కుప్పంలో మున్సిపాలిటీ ఓడిపోవడం నిజంగా చంద్రబాబుకు పరాభవమే. చంద్రబాబు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల కొందరు నాయకులకు కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆ నియోజకవర్గానికి ప్రతి సారి వెళ్లలేరు. ప్రజలను కలుసుకోలేరు. అందుకే కొందరు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలో ఉండగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు నాయకులు దారితప్పారు. అక్రమ లేఅవుట్లు వేయడం, ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో రాయించుకోవడం లాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు పీఏ లాంటి నాయకులు కూడా ఇందులో ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నాయకులను బెదిరింపులకు గురి చేశారు. వారు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ.. ఉంటే సైలెంట్ గా ఉండండి లేదా వైసీపీకి మద్దతు ఇవ్వండి లేకపోతే మీ అవినీతి కార్యక్రమాలు, తప్పులు బయటకు వచ్చేస్తాయి అంటూ బెదిరించారు. దీంతో కొంత మంది నాయకులు వైసీపీలో చేరిపోగా, కొందరు సైలెంట్ అయిపోయారు.

సమయం కోసం వేచి చూసే ధోరణలో చంద్రబాబు

చంద్రబాబు నమ్ముకున్న నాయకులు గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసి ఇప్పుడు వైసీపీ నేతలకు ఇరుక్కోవడం వల్ల కుప్పంలో నేడు ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఇంకా తయారు చేయలేదు. అందుకే అక్కడ టీడీపీ వైసీపీ తాకట్టుకు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తే ఎన్నికల సమయానికి వీళ్లు తప్పులు చేయడమో లేక వీళ్లని వైసీపీ లోబర్చుకోవడమో లాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున వేచి చూసే ధోరణలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అక్కడి పరిస్థితులు మొత్తం చంద్రబాబుకు తెలిసినందున ఎన్నికలకు కొద్ది నెలల ముందు అక్కడ నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

author avatar
Special Bureau

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N