ట్రెండింగ్ న్యూస్

ఇది స్టాండప్ కామెడీలా లేదు.. భార్య బాధితుల సంఘంలా ఉంది.. నాగబాబుకు పంచ్ వేసిన కంటెస్టెంట్?

kushi kushiga episode 5 promo
Share

తెలుగులో సరికొత్త కామెడీని పంచడం కోసం నాగబాబు తీసుకొచ్చిన ఐడియానే ఖుషీ ఖుషీగా కామెడీ షో. ఇది మామూలు కామెడీ షోల్లా కాదు. ఇది ఒక స్టాండప్ కామెడీ. అంటే.. ఆడియెన్స్ ముందు నిలబడి.. వాళ్లను నవ్వించడం అన్నమాట. వాళ్లను కడుపుబ్బా నవ్వించగలిగితే గ్రేట్. అదే స్టాండప్ కామెడీ. ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ ను తీసుకొని కానీ.. లేదా సొంతంగా రాసుకున్నది ఏదైనా కానీ తీసుకొని దాని నుంచి కామెడీని తీయగలిగితే స్టాండప్ కామెడీలో రాణించవచ్చు. ప్రస్తుతం స్టాండప్ కామెడీకి తెలుగులో కూడా స్కోప్ బాగానే ఉంది.

kushi kushiga episode 5 promo
kushi kushiga episode 5 promo

అందుకే.. నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోను తీసుకొచ్చారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది ఈ షో. త్వరలోనే ఐదో ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. తాజాగా ఐదో ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమో కూడా ప్రేక్షకులను బాగానే నవ్వించింది. కామెడీ అంటేనే స్కిట్లు చూడటం.. ఏదైనా జోక్ వేయడం చూశాం కానీ.. స్టాండప్ కామెడీ ద్వారా నవ్వొచ్చని ఈ ప్రోగ్రామ్ ద్వారానే తెలిసింది.

అయితే.. ఈ ప్రోమోలో ఒక ట్విస్ట్ ఉంది. చివర్లో ఓ కంటెస్టెంట్ వేసిన జోకులకు ఎవ్వరూ నవ్వకపోయే సరికి.. ఇది స్టాండప్ కామెడీలా లేదు.. భార్య బాధితుల సంఘంలా ఉంది.. అంటూ నాగబాబుకు పంచ్ వేసేసరికి.. అప్పుడు కానీ.. అందరూ నవ్వలేదు. మొత్తం మీద ఈ ప్రోమో చూసి మీరు కూడా కాసేపు నవ్వుకోండి.


Share

Related posts

Tea: ఇలా టీ చేసుకొని తాగితే మీ ఆరోగ్యం పదిలం..!

Ram

కన్నకొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ!

Teja

ఒకటే టాపిక్: తెల్లరుతూనే వైకాపాలో చెవులు కొరికేసుకునేంత డిస్కషన్!

CMR
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar