Kushi Kushiga : ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు తన సొంత యూట్యూబ్ చానెల్ లో తీసుకొచ్చిన షో ఇది. తెలుగులో మొట్టమొదటి స్టాండప్ కామెడీ షో ఇది. ఇదివరకు తెలుగు బుల్లితెర మీద స్టాండప్ కామెడీ షోలు వచ్చినా… అంతగా అవి బుల్లితెర ప్రేక్షకులను సరిగ్గా ఆదరించలేకపోయాయి. దీంతో స్టాండప్ కామెడీ షోలకు బ్రేక్ పడింది.

వేరే భాషల్లో సూపర్ సక్సెస్ అయిన స్టాండప్ కామెడీ షోలు.. తెలుగులో ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు. వాటికి కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారని భావించిన నాగబాబు… తన సొంత యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షోను ప్రారంభించారు.
ఇప్పటికే ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షో మొదటి సీజన్ పూర్తి కావచ్చింది. గ్రాండ్ ఫినాలే మొదటి ఎపిసోడ్ ఇప్పటికే రిలీజ్ అయింది. తాజాగా గ్రాండ్ ఫినాలే రెండో ఎపిసోడ్ కూడా రిలీజ్ అయింది.
Kushi Kushiga : గ్రాండ్ ఫినాలేలో తెగ నవ్వించిన కంటెస్టెంట్లు
తాజాగా గ్రాండ్ ఫినాలే రెండో ఎపిసోడ్ ను నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశారు. గ్రాండ్ ఫినాలే రెండో ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్లు బాగానే నవ్వించారు. స్టాండప్ కామెడీకి మరో అర్థం చెప్పారు. మొత్తం మీద ఖుషీ ఖుషీగా కామెడీ షో సూపర్ సక్సెస్ అయినట్టే.
మొదటి సీజన్ పూర్తి కాగానే… త్వరలోనే రెండో సీజన్ ను ప్రారంభించడానికి నాగబాబు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 2 ను చూసేయండి.