Kushi Kushiga : ఖుషీ ఖుషీగా Kushi Kushiga స్టాండప్ కామెడీ షో గురించి తెలుసు కదా. మొదటి సారి తెలుగులో వచ్చిన స్టాండప్ కామెడీ షో ఇది. ఇదివరకు చాలా షోలు వచ్చినా.. ఏవీ ఇన్ని రోజులు నడవలేదు. మొదటి సారి.. ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్నారు.

అందుకే.. నాగబాబు కూడా ఖుషీ ఖుషీగా షోపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 12 ఎపిసోడ్స్ ను ఖుషీ ఖుషీగా పూర్తి చేసుకుంది. నెటిజన్ల నుంచి బాగానే రెస్పాన్స్ వస్తోంది. అందుకే.. ఈ షో రెండో సీజన్ ను కూడా నాగబాబు ప్లాన్ చేశారు.
Kushi Kushiga : ఎపిసోడ్ 13లో మెరిసిన నిహారిక, దనాదన్ దన్ రాజ్
తాజాగా 13వ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్టులుగా మెగా డాటర్ నిహారిక, ప్రముఖ కమెడియన్ దనాదన్ దన్ రాజ్ మెరిశారు.
స్టాండప్ కమెడియన్ల పంచ్ లకు నవ్వలేకపోయారు వీళ్లు. మొత్తానికి ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షో.. తెలుగులో నిలదొక్కుకున్నట్టే. ఈ షో సక్సెస్ తో.. తెలుగు చానెళ్లు.. ఇటువంటి స్టాండప్ కామెడీ షోలపై దృష్టి సారిస్తాయో లేదో వేచి చూడాల్సిందే. తాజాగా విడుదలైన ఖుషీ ఖుషీగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను మీరు కూడా చూసేయండి.