ట్రెండింగ్ న్యూస్

తెలుగులో స్టాండప్ కామెడీని ఎంకరేజ్ చేయండి.. నాగబాబు ప్రెస్ మీట్

kushi kushiga standup comedy press meet by nagababu
Share

ఖుషీ ఖుషీగా.. తెలుగులో వస్తున్న మొట్టమొదటి స్టాండప్ కామెడీ షో. ఈ షోకు పునాది వేసింది నాగబాబు. ఆయన తన యూట్యూబ్ చానెల్ లో ఈ షోను ప్రారంభించారు. ఇప్పటికే స్టాండప్ కామెడీకి సంబంధించిన ఖుషీఖుషీగా షో ప్రోమోలు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి.

kushi kushiga standup comedy press meet by nagababu
kushi kushiga standup comedy press meet by nagababu

తెలుగులో మొట్టమెదటిసారిగా.. చేస్తున్న ఈ కొత్త ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని.. స్టాండప్ కామెడీని ఎంకరేజ్ చేయాలంటూ నాగబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఆయనతో పాటు.. ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. డిసెంబర్ 18న స్టాండప్ కామెడీకి సంబందించిన మొదటి ఎపిసోడ్ ను విడుదల చేస్తున్నట్టుగా నాగబాబు ప్రకటించారు.

ఇప్పటికే పలు భాషల్లో స్టాండప్ కామెడీలు ఉన్నాయి కానీ.. తెలుగులో ఇప్పటి వరకు స్టాండప్ కామెడీకి సరైన ప్లాట్ ఫాం లేదు. మనిషికి కావాల్సినంత నవ్వు ఈ స్టాండప్ కామెడీల ద్వారా దొరుకుతుంది. అందుకే.. స్టాండప్ కామెడీకి తెలుగులో ఒక ప్లాట్ ఫాంను తీసుకొచ్చామని.. ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చని నాగబాబు తెలిపారు.

నాగబాబు కొణిదెల ఒరిజినల్స్ పేరుతో స్టాండప్ కామెడీ సిరీస్ లను విడుదల చేయనున్నారు. బొమ్మ అదిరింది సద్దాం, అభి కూడా ఈ స్టాండప్ కామెడీల్లో పార్టిసిపేట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూడండి.


Share

Related posts

F 3 : ఎఫ్ 3 లో తమన్నా, మెహ్రీన్ తో పాటు వకీల్ సాబ్ హీరోయిన్ కూడా..?

GRK

Assembly Election Results 2022: పంజాబ్‌లో జయకేతనం దిశగా అప్..మ్యాజిక్ ఫిగర్ దాటి  

somaraju sharma

దేశంలో ఉన్నత దాత..! నాలుగు భాషల్లో సినిమా.., ఈ కథ తెలుసుకోవాల్సిందే..!!

bharani jella