Kushi Kushiga : ఖుషీ ఖుషీగా kushi Kushiga స్టాండప్ కామెడీ షో గురించి తెలుసు కదా. స్టాండప్ కామెడీకి సరికొత్త అర్థం చెబుతోంది ఖుషీ ఖుషీగా కామెడీ షో. నిజానికి తెలుగులో స్టాండప్ కామెడీ షోకు పెద్దగా స్కోప్ లేదు. తెలుగు ప్రేక్షకులకు అది పరిచయం అయితే బాగానే ఉంటుంది కానీ.. పెద్దగా ఎవ్వరూ తెలుగులో ప్రయోగం చేయడం లేదు. కొన్ని చానెళ్లలో ట్రై చేశారు కానీ వర్కవుట్ కాలేదు.

అయితే.. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోను ప్రారంభించారు. ఇది ప్రారంభమై చాలా రోజులే అవుతోంది. ఇప్పటికే.. 10 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. 11వ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.
Kushi Kushiga : స్టాండప్ కామెడీ తెలుగు ప్రేక్షకులకు నచ్చడం లేదా?
స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకోవడం అనే మంచి ఉద్దేశమే. ఇప్పటికే పలు భాషల్లో స్టాండప్ కామెడీ షోలను ఆదరిస్తున్నారు. కానీ.. తెలుగులో ఇంకా స్టాండప్ కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు తక్కువే. అయినప్పటికీ.. నాగబాబు డేర్ చేసి ఈ షోను ప్రారంభించినా.. 11 ఎపిసోడ్స్ పూర్తి చేస్తుకున్నా.. ఆ షోకు నెటిజన్ల నుంచి అంతగా రెస్పాన్స్ రావడం లేదు.
ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షో ప్రారంభం అయినప్పుడు ఈ షో సూపర్ సక్సెస్ అవుతుందని అంతా భావించారు. ఎందుకంటే.. జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ ప్రోగ్రామ్స్ ను జనాలు ఇప్పటికీ ఆదరిస్తున్నారు కాబట్టి.. స్టాండప్ కామెడీని కూడా ఆదరిస్తారని అనుకున్నారు కానీ.. అనుకున్నంతగా స్టాండప్ కామెడీకి ఆదరణ లభించడం లేదు.
మొదటి సీజన్ అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవడంతో.. రెండో సీజన్ ప్రారంభం విషయమై పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఖుషీ ఖుషీగా భవిష్యత్తులో సంచలనాలను సృష్టిస్తుందా? లేక ఇది కూడా ఇక్కడితో ఆగిపోతుందా?