AP CM YS Jagan: 2024 ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి మళ్లీ సీఎం అవుతారా..? కేవిపీ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

Share

AP CM YS Jagan: ఏపిలో సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి గ్రాఫ్ పడిపోతోంది.. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వైసీపీకి ఉన్న పరిస్థితి నేడు లేదంటూ ప్రచారం జరుగుతుండటం అదే మారిదిరా పలు సర్వేలు వెలుగులోకి వస్తుందటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేవలం సంక్షేమ పథకాలకే జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని విస్మరించారనీ, ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలు చేస్తున్నారన్న విమర్శ ఉంది. మరో పక్క వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు ప్రభుత్వానికి, వైసీపీకి కొరకరాని కొయ్యగా మారి నిత్యం జగన్మోహనరెడ్డి నిర్ణయాలను తప్పుబడుతూ, వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో రఘురామ కృష్ణం రాజుకు వియ్యంకుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా రెండు తెలుగు రాష్ట్రాల  ప్రజలందరికీ, రాజకీయ నేతలకు చిరపరిచితులైన కాంగ్రెస్ పార్టీ నేత కేవిపీ రామచంద్రరావు ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆశక్తికరంగా మారాయి.

KVP Rmachandra rao comments on jagan govt?
KVP Rmachandra rao comments on jagan govt?

AP CM YS Jagan: జగన్ వయసులో నాడు వైఎస్‌కు విమర్శలు

జగన్మోహనరెడ్డి పాలనా తీరుపై, 2024 ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి పై కేవిపీ చెప్పిన సమాధానాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్ పరిపాలనా విషయంలో ఎదుర్కొంటున్న విమర్శల విషయంపై మాట్లాడుతూ  40 -45 ఏళ్ల వయసులో రాజశేఖరరెడ్డి కూడా ప్రస్తుతం జగన్మోహనరెడ్డి ఎదుర్కొంటున్న విమర్శలనే ఎదుర్కొన్నారన్నారు. 50 ఏళ్ల తరువాతే రాజశేఖరరెడ్డి ఆరోపణల నుండి బయటపడ్డారు అన్నట్లుగా వివరించారు.  వైఎస్ఆర్ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో పార్టీలో ముఖ్యులు, సలహాదారులు, మేధావులు, సీనియర్ లతో చర్చలు జరిగేవన్నారు. నాడు ఒక టీమ్ పని చేసిందన్నారు కేవిపీ.

KVP Rmachandra rao comments on jagan govt?
KVP Rmachandra rao comments on jagan govt?

జోతిష్యుడిని కాను

ఇక్కక మరొక కీలక పాయింట్ ఏమిటంటే..నాడు వైఎస్ఆర్ హయాంలోని మంత్రివర్గంలో ఆలోచనా పరులు, కొంత మంది సలహదారులు ఉండేవారిని వారితో వైఎస్ఆర్ చర్చించే వారని అన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాట వేసిన కేవిపీ.. తాను జోతిష్క్యుడిని కాదంటూ తెల్చి చెప్పారు. నాడు వైఎస్ఆర్ హయాంలో జరిగినట్లుగా ప్రస్తుతం చర్చలు తక్కువగా జరుగుతున్నాయేమో అన్న అభిప్రాయాన్ని కేవిపి వ్యక్తం చేశారు. రాజు గారి భార్య పెద్ద భార్య మంచిది అన్నట్లుగా తన అభిప్రాయాలను కేవిపీ పరోక్ష పద్ధతిలో వెల్లడించారు. కేవిపీ చేసిన వ్యాఖ్యలపై వైసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ వెనుక కేవిపీ ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: హౌస్ లో శనివారం అదిరిపోయే టాస్క్.. జడ్జిగా సోహెల్..!!

sekhar

Diabetes: డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. తెలుసుకోకపోతే ప్రమాదమే..!! 

bharani jella

TRS: ఔను బానిస‌నే అంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

sridhar