కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ పేరు తెలియనివారుండరు..! ఇప్పుడు 12వ సీజన్ నడుస్తోందంటే.. ఎంత క్రేజో..! చూడండి మరి..! హిందీలో ఈ షో బాగా పాపులర్..! అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు..! ఈ సీజన్ లో ఇప్పుడు ముగ్గురు మహిళా కంటెస్టెంట్ లు కోటి రూపాయలు.. గెలుచుకున్నారు..తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన విజయపాల్ సింగ్ రాథోడ్ పాల్గొన్నారు..ప్రస్తుతం విజయ్ రాథోడ్ కోటి రూపాయల సమాధానం చెప్పబోతున్నాడు.. బిగ్ బీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో ఆయన తనకు ఇష్టమైన బాలీవుడ్ నటి కియారా అద్వానీ అంటే ఇష్టమని,తననే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు..దీంతో బిగ్ బీ కూడా షాక్ అయ్యాడు.. పూర్తి వివరాలు ఇలా..
బీద కుటుంబానికి చెందిన విజయ్ కొరియర్ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆయన నెల వేతనం 8 వేలు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో కేబీసీ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం విజయ్ రాథోడ్ కోటి రూపాయల సమాధానం చెప్పబోతున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ క్రమంలో ఆయనకు తన ఇష్టమైన బాలీవుడ్ నటి కియారా అద్వానీ అంటే ఇష్టమని తెలిపాడు. ఆమె సినిమాలన్నీ చూస్తానని ఆమె ఫోటో ఎప్పుడూ తన వద్ద ఉంటుందని చెప్పడమే కాకుండా తన జేబులో నుంచి తీసి చూపించాడు..తనంటే ఇష్టం ఉందని ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బిగ్ బి కూడా షాక్ అయ్యారు. తన ప్రేమని బిగ్ బీ ముందు.. కొన్ని కోట్ల మంది వీక్షించే ఈ షోలో చెప్పే అవకాశం రావడం నిజంగా విజయ్ అదృష్టమని చెప్పాలి. అయితే దీనిపై కియారా అద్వానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.. మరి.