Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూవెళ్తూ రవి కి వార్నింగ్ ఇచ్చిన లహరి..!!

Share

Bigg Boss 5 Telugu: అనుకున్నట్టుగానే బిగ్బాస్ హౌస్ నుండి లహరి ఎలిమినేట్ కావడం తెలిసిందే. ప్రియా లహరి మధ్య జరిగిన గొడవకి కారణం రవి అని.. అడ్డంగా కెమెరాలో బుక్ అయిపోయాడు. ఇతరులను మెప్పించడానికి ఎదుటివారిని ఎదవలు చేయడానికి.. రవి వేస్తున్న ఎత్తుగడలు.. బిగ్ బాస్ హౌస్ లో చిత్తు చిత్తు కావటం మాత్రమేకాక రవి గ్రాఫ్ అమాంతం తగ్గి పోయేటట్లు చేస్తూ ఉన్నాయి. ఇదే రోజు అయింది ప్రియా లహరి హగ్ గొడవలో. ఏకంగా యాంకర్ నాగార్జున ముందు రవి అబద్ధాలు ఆడటం తో పాటు వీడియోలో రవి అడ్డంగా బుక్ కావడం..తో.. నిజంగానే హౌస్ లో రవి.. నటరాజ్ మాస్టర్ అన్నట్టు గుంటనక్క అంటూ.. బయట నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో.. ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు లహరిని నాగార్జున ప్రకటించడం తెలిసిందే.

Bigg Boss Telugu 5 Elimination: Lahari Shari gets evicted in the third week | Bollywood Bubble

ఈ నేపథ్యంలో.. నాగు ప్రకటించగానే రవి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మరో పక్క శ్వేతా అయితే లహరి ని గట్టిగా హగ్ చేసుకొని… గుక్కపెట్టి ఏడ్చేసింది. మరోపక్క సిరి లహరి నీ.. తన గురించి స్టేజిమీద చెప్పొద్దని.. ఫైర్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో రవి కలుగజేసుకుని.. మీరు ఒకరి కోసం మరొకరు మారదు అంటూ.. సూచించారు. అదేవిధంగా మీ స్నేహాన్ని కూడా మార్చుకో వద్దు అంటూ సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో స్టేజ్ పైకి వచ్చిన లహరి తో… నాగార్జున గేమ్ ఆడించడం జరిగింది. ఇంటి సభ్యులనీ… లహరి గేమ్ ఆడే లా.. నాగార్జున వ్యవహరించగా ఈ క్రమంలో..స్టేజీ మీదకు వచ్చిన లహరి.. శ్రీరామ్‌ తనకోసం ఓ పాట పాడాలంది. తను నోరు తెరిచి అడిగాక శ్రీరామ్‌ కాదంటాడా? ఎటో వెళ్లిపోయింది మనసు పాట అందుకున్నాడు. తర్వాత లహరితో ఫేల్‌డ్‌ హౌస్‌మేట్స్‌ గేమ్‌ ఆడించాడు. సిరి.. వేరే అమ్మాయిలంటే ఇన్‌సెక్యురిటీస్‌ అని, యానీ మాస్టర్‌.. వెరీ స్వీట్‌ అని చెప్పింది.

Bigg Boss Telugu 5 contestants list with photos: From Ravi to Lahari Shari, confirmed list of contestants of Bigg Boss Telugu Season 5

యాంకర్‌ రవికి.. కెమెరాలున్నాయి, బీకేర్‌ఫుల్‌ అని హెచ్చరించింది. అదేవిధంగా ఎదుటి వ్యక్తిని అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అని ప్రియా కు సూచించింది. శ్రీరామ్ ఇంటిలో తన కోసం తానుగా కొంత టైం కేటాయించుకోవాలి అని సూచించింది. విశ్వ ఇంటిలో ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అదే రీతిలో..లోబో తో.. క్లోజ్ గా ఉండాలని ఈక్వేషన్స్ మారిపోయాయని జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నటరాజ్‌ మాస్టర్‌.. భోళా శంకరుడని, శ్వేత.. స్ట్రాంగ్‌గా ఉండాలని, కాజల్‌.. కెమెరాలున్నాయి, కాబట్టి ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకోమని సలహా ఇచ్చింది. సిరి నామినేట్‌ చేసిందని నామినేట్‌ చేశావ్‌, ఏంట్రా ఇది? అని షణ్నును క్వశ్చన్‌ చేసింది. మళ్లీ సిరితో ముడిపెట్టడంతో మండిపోయిన షణ్ను.. అందుకే నువ్వు అక్కడున్నావ్‌ అని కౌంటరిచ్చాడు. సిరి మాట్లాడినదానికే తలాడించకని సూచించింది. నువ్వు ఆలోచిస్తుంది రాంగ్‌ అని లహరిపై మండిపడ్డాడు షణ్ను. గేమ్ పరంగా జేసీకి ఫుల్ క్లారిటీ ఉందని.. మిగతా వాళ్లని ఫాలో అవడంతో చిన్నపిల్లాడిగా ఆడకూడదు అని పేర్కొంది. అదేవిధంగా సన్నీ ఇంట్లో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాడు.. కానీ తాను అనుకున్నంత అతడు షార్ప్ కాదని పేర్కొంది. ఇక ప్రియాంక సింగ్ నీ.. రోల్ మోడల్ గా తీసుకుంటే జీవితంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటామంటూ లహరి పాజిటివ్ కామెంట్ ఇచ్చింది. మానస గురించి తెలుసుకుందామని లోపే బయటకు వచేయడం జరిగిందని పేర్కొంది. హమీద చాలా స్ట్రాంగ్ లేడీ అని లహరి ప్రశంసించింది. ఏదిఏమైనా లహరి ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం రవి ఆడిన డబల్ గేమ్ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి నుండి బయటకు వస్తూ లహరి రవికి కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అంటూ.. కామెంట్ చేయడం ఆదివారం ఎపిసోడ్ కి హైలెట్ అని జనాలు అంటున్నారు.


Share

Related posts

corona: దేశంలో క‌రోనా క‌ల‌కలం… సాక్షాత్తు రాష్ట్రప‌తే ఆ మాట చెప్పారు

sridhar

తిరుపతి పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టిన ఆళ్ళ నాని

Vihari

ఎనిమిది మంది ఎంపీలపై జగన్ గుస్సా! అసలేం జరిగింది??

Yandamuri