లాయిరే లల్లాయిరే అంటూ మంగ్లీ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంటే చూడకుండా ఉంటామా? రాములో రాములా.. అంటూ డ్యాన్స్ రానివాళ్లతో కూడా డ్యాన్స్ చేయించిన గొంతు మంగ్లీ సొంతం. మంగ్లీ పాటలకు తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ ఉంటుంది. మైక్ టీవీతో పరిచయం అయిన మంగ్లీ… సరికొత్త జానపద గేయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అప్పట్లో బతుకమ్మ, బోనాలు పండుగ వస్తే చాలు.. మంగ్లీ పాటలు యూట్యూబ్ లో దర్శనం ఇవ్వాల్సిందే.

అందుకే.. మంగ్లీ యూట్యూబ్ చానెల్ లో కొత్త కొత్త పాటలను విడుదల చేస్తుంటుంది. ముఖ్యంగా తెలంగాణ పండుగల మీద ఎన్నో పాటలను ఆమె పాడటంతో పాటు.. వీడియోలను కూడా రూపొందించింది.
తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో లాయిరే లల్లాయిరే అనే మరో పాటను విడుదల చేసింది. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.
ఈపాటను తిరుపతి మట్ల రచించారు. ఈ పాటను మంగ్లీ పాడటం, అచ్చ తెలుగు పట్టుచీరలో డ్యాన్స్ వేయడంతో ఈ పాటకు ప్రస్తుతం క్రేజ్ ఏర్పడింది. పట్టుచీరె కట్టుకొని.. అచ్చతెలుగు ఆడపిల్లలా కనిపించిన మంగ్లీ.. వేసిన డ్యాన్స్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి…